DMK Fan Cut off His Fingers: స్టాలిన్ సీఎం కావాలని చేతి వేళ్లు నరుకున్న డీఎంకే కార్యకర్త

|

Apr 04, 2021 | 6:13 PM

పిచ్చి అంటే ఇదే... తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే గెలవాలని ఆ పార్టీ కార్యకర్త ఒకరు మూడు వేళ్లు నరుక్కున్నాడు. స్టాలిన్ సీఎం కావాలంటూ మొక్కులు చెల్లించుకున్నాడు.

DMK Fan Cut off His Fingers: స్టాలిన్ సీఎం కావాలని చేతి వేళ్లు నరుకున్న డీఎంకే కార్యకర్త
Tamil Nadu Election
Follow us on

పిచ్చి అంటే ఇదే… తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే గెలవాలని ఆ పార్టీ కార్యకర్త ఒకరు మూడు వేళ్లు నరుక్కున్నాడు. స్టాలిన్ సీఎం కావాలంటూ మొక్కులు చెల్లించుకున్నాడు. తన కోరిక తీర్చాలంటూ వింతగా ప్రవర్తించాడు. ఈ తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

చేతి వేళ్ళు నరికేసుకున్న ఘటన కలకలం రేపింది. విరుదునగర్ జిల్లాలో ఒళ్ళు జలదరించే విధంగా మొక్కు చెల్లించాడు డీఎంకే కార్యకర్త . డీఎంకే నేత స్టాలిన్ సీఎం అవ్వాలని చేతి వేళ్ళు నరికేసుకున్నాడు.

సాథుర్ లోని మరియమ్మ ఆలయంలో డీఎంకే నేత స్టాలిన్ గులుపొందాలని ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అనంతరం గురువయ్య ఈ పిచ్చి పని చేశాడు. అమ్మవారికి తన చేతి వేళ్ళు నరికి కానుక ఇచ్చిన గురువయ్య తన సంకల్పం నెరవేతుందని అంటున్నాడు.

ఇదిలావుంటే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ముమ్మరంగా క్యాంపెయిన్‌ చేస్తున్నారు అన్ని పార్టీల అగ్ర నేతలు. వారితోపాటు సినిమా తారలు కూడా క్యాంపెయిన్‌లో తళుక్కుమంటున్నారు. ఓటర్లను ఆకర్షిస్తూ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. బీజేపీ కండువాలు కప్పుకుని నాటి హీరోయిన్‌ గౌతమి ప్రచారం చేస్తుంటే.. మరో హీరోయిన్‌ నమిత కూడా ప్రచారంలో తమిళ జనాన్ని ఆకర్షిస్తున్నారు. దక్షిణ కోయంబత్తూరులో ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఓ ఎన్నికల ప్రచారంలో సినిమా పాటలకు రోడ్డుపైనే స్టెప్పులేశారు నమిత. కమల్‌హాసన్‌పై పోటీ చేస్తున్న వానతి శ్రీనివాసన్‌కు మద్దతుగా క్యాంపెయిన్‌ చేశారు ఈ ముద్దుగుమ్మ.

మొత్తమ్మీద ఎన్నికల్లో పోటీచేస్తున్న సినీ నటులు గెలుస్తారా? గెలిస్తే మెజారిటీ ఎంత అన్నది ఒక పాయింట్‌. ఇక- సినీ నటులు ప్రచారం చేసిన చోట.. ఆ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయన్నది మరో అంశం. ఇదే- సాంబార్‌ పాలిటిక్స్‌లో హాట్‌ పాయింట్‌. ఇదింతా హాట్ హాట్‌గా ఉంటే మరో వైపు మూడనమ్మకాలతో కొందరు రాజకీయ భక్తులు పిచ్చి పనులతో ఊగిపోతున్నారు.

ఇవి కూడా చదవండి: Why Fan Have Three Blades: మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా..! ఫ్యాన్‌కు మూడు రెక్కలే ఎందుకుంటాయో తెలుసా..!

మీ ఇంట్లో బల్లి ఉందా..! బల్లిని చూస్తే భయపడుతున్నారా..! బయటకు పంపించే సులభమైన మార్గం ఇదే..!