టీటీవీ దినకరన్ పార్టీతో నటుడు విజయ్ కాంత్ పార్టీ పొత్తు , 60 సీట్లకు పోటీ, తొలి విడత అభ్యర్థుల జాబితా రిలీజ్

| Edited By: Anil kumar poka

Mar 15, 2021 | 10:46 AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీటీవీ దినకరన్ పార్టీ ...అమ్మమక్కల్ మున్నేట్ర కళగం పార్టీతో నటుడు విజయ్ కాంత్ పార్టీ డీఎండీకె పొత్తు కుదుర్చుకుంది.  అన్నాడీఎంకే నేతృత్వంలోని  కూటమితో...

టీటీవీ దినకరన్ పార్టీతో నటుడు విజయ్ కాంత్ పార్టీ పొత్తు , 60 సీట్లకు పోటీ, తొలి విడత అభ్యర్థుల జాబితా రిలీజ్
Actor Vijaykanth's Party Announces Akkiance With Ttv Dinakaran Party
Follow us on

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీటీవీ దినకరన్ పార్టీ …అమ్మమక్కల్ మున్నేట్ర కళగం పార్టీతో నటుడు విజయ్ కాంత్ పార్టీ డీఎండీకె పొత్తు కుదుర్చుకుంది.  అన్నాడీఎంకే నేతృత్వంలోని  కూటమితో సీట్ల సర్దుబాటులో అంగీకారం కుదరకపోవడంతో ఆ డీల్ నుంచి విజయ్ కాంత్ తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దినకరన్ పార్టీతో ఆయన చేతులు కలిపారు. ఈయన పార్టీ 60 సీట్లకు పోటీ చేయనుంది. డీఎండీకే కి కేటాయించిన స్థానాల నుంచి తమ పార్టీ అభ్యర్థులను ఉపసంహరించుకుంటామని అమ్మ మక్కల్ కళగం పార్టీ ప్రకటించింది. అటు-డీఎండీకే తమ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించింది. ఈ మేరకు విజయ్ కాంత్ భార్య ప్రేమలత విరుదాచలం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే పి.పార్థసారథి  విరుంగంబాక్కం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అంబుమణి రాందాస్ నేతృత్వంలోని పీఎంకేకి అన్నాడీఎంకే 23 సీట్లను కేటాయించగా.. బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తోంది.   కాగా తాము అన్నాడీఎంకేని 23 స్థానాలు, ఓ రాజ్యసభ సీటును కోరామని, కానీ 15 సీట్లకు మించి ఇవ్వజాలమని ఆ పార్టీ అశక్తత వ్యక్తం చేసిందని పార్థసారథి తెలిపారు.

2005 లో విజయ్ కాంత్ ఏర్పాటు చేసిన పార్టీ 2006 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో8.38 శాతం ఓట్లను కైవసం చేసుకోగలిగింది.2009  లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన ఓట్ల శాతాన్ని మరింత మెరుగుపరచుకోగలిగింది. అయితే 2011 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరింత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇఛ్చి29 సీట్లను గెలుచుకోగలిగింది. ప్రధాన ప్రతిపక్ష స్థాయిని పొందింది. కానీ 2016 లో ఏ కారణంవల్లో మళ్ళీ తన పూర్వ సత్తాను చాటుకోలేకపోయింది.వైకో నేతృత్వం లోని పార్టీతో బాటు సీపీఐ, సీపీఎం, తమిళ మానిల కాంగ్రెస్  తదితర చిన్నా చితకా పార్టీలతో పొత్తు పెట్టుకుని కూడా  విజయం సాధించలేకపోయింది. ఇక డీఎంకే..కాంగ్రెస్, ఇతర లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుంది.

మరిన్ని చదవండి ఇక్కడ :
‘నా సావు నేను చస్తా’ డైరెక్టర్‌గా ప్రియదర్శి : Comedian Priyadarshi to turn Director Video.

శోభనానికి అంగీకరించని భార్య ఆరాతీస్తే విస్తుపోయే నిజాలు.. షాక్ అయిన భర్త..! : Wedding viral Video

ఒక్క ఫోన్‌కాల్… అడ్డంగా బుక్కైన యువతి ఇంత సులభంగా అంత మోసం.: woman Loss 6.4 Lakhs Video.