UP Elections: మరోసారి తెరపైకి కుల ప్రాతిపదికన జనాభా గణన.. అధికారంలోకి రాగానే చేపడతామన్న అఖిలేష్

|

Jan 17, 2022 | 6:26 PM

Caste Based Census: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎన్నికల్లో గెలిస్తే 3 నెలల్లో రాష్ట్రంలో కులాల వారీగా జనాభా గణన చేపడతామని హామీ ఇచ్చారు.

UP Elections: మరోసారి తెరపైకి కుల ప్రాతిపదికన జనాభా గణన.. అధికారంలోకి రాగానే చేపడతామన్న అఖిలేష్
Caste Based Census
Follow us on

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎన్నికల్లో గెలిస్తే 3 నెలల్లో రాష్ట్రంలో కులాల వారీగా జనాభా గణన చేపడతామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, ఉత్తరప్రదేశ్‌లో కుల ఆధారిత జనాభా గణనను నిర్వహిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదివారం పునరుద్ఘాటించారు. ఈ ప్రభుత్వం చెట్లను, జంతువులను లెక్కిస్తోంది. కానీ జనాభాలో వెనుకబడిన వారిని ఎందుకు లెక్కించడం లేదని యాదవ్ ప్రశ్నించారు. వెనుకబడిన వారికి జనాభాలో వారి వాటా ప్రకారం లబ్ధి చేకూరేలా కుల గణన జరగాలన్నారు.

ఉత్తరప్రదేశ్‌తో సహా మరో ఐదు రాష్ట్రాల్లో వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఫలితాలను కూడా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే వివిధ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాల హామీలను గుప్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతున్నాయి.

ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన దారా సింగ్ చౌహాన్‌కు పార్టీ సభ్యత్వం అందజేస్తూ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. తమ పార్టీ, మిత్రపక్షాలు చాలా కాలంగా కుల ప్రాతిపదికన జనాభా గణనను డిమాండ్ చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే 3 నెలల్లో కులాల వారీ జనాభా గణనను ప్రారంభిస్తామన్నారు.

అటువంటి ప్రతిపాదనను ముందుకు తెచ్చిన మొదటి రాజకీయ పార్టీ సమాజ్ వాదీ పార్టీ కాదు. గతంలోనూ అనేక పార్టీలు కులాల ప్రతిపాదికన గణన జరగాల్సిందేనని పట్టబడుతున్నాయి. పొరుగున ఉన్న బీహార్ లోనే ప్రతిపక్షంలో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కూడా బీహార్ లో కుల ప్రాతిపదికన జనాభా గణన చేపట్టాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. అయితే, బిజెపి ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతో పాటు దశాబ్ధ కులాల గణనలో OBCలను చేర్చాలని బిజెపి బీహార్ మిత్రపక్షం జనతాదళ్ (యునైటెడ్) నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఒత్తిడిలో తెస్తోంది.

డిసెంబర్‌ నెలలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలు మినహా ఇతర కులాల జనాభా గణనను నిర్వహించడానికి కేంద్రం నిరాకరించిన తర్వాత తమ ప్రభుత్వం రాష్ట్ర-నిర్దిష్ట కసరత్తును నిర్వహించడానికి సిద్ధమవుతోందని చెప్పారు. అయితే కేంద్రం మాత్రం కుల గణనను నిర్వహించేది లేదని తేల్చి చెప్పింది. వాస్తవానికి, SC, STలు కాకుండా ఇతర కులాలను “జనాభా లెక్కల పరిధి నుండి మినహాయించడం చేతన విధాన నిర్ణయం” అని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఇదిలావుంటే, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని అఖిలేష్ యాదవ్ చెబుతూ, ఆ తర్వాత అనేక వాగ్దానాలు చేస్తుంటే, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఎన్నికలకు ముందు మాత్రం నేతల పరిస్థితి తారుమారైంది. కొంతకాలం క్రితం స్వామి ప్రసాద్ మౌర్య బిజెపిలో తెగతెంపులు చేసుకుంటారనే భయంతో సమాజ్‌వాదీ పార్టీలో చేరారని, ఇప్పుడు చాలా మంది బిజెపి నాయకులు పార్టీని వీడబోతున్నారని ఆయన పేర్కొన్నారు.


ఇదిలావుంటే, ఇటీవల, సమాజ్ వాదీ MLC ఘనశ్యామ్ లోధి భారతీయ జనతా పార్టీలో చేరారు. ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరవచ్చని కూడా చర్చలు జరుగుతున్నాయి. 2017లో అపర్ణ లక్నో కాంట్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.

Read Also…. TS Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశం.. కోవిడ్ పరిస్థితులు, వానాకాలం ధాన్యం కొనుగోలు, పంట నష్టంపై చర్చ!