పీక్ స్టేజ్ కు యూపీ పోరు.. ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కీలకం కానున్న ఆ ఇరువురి కలయిక

|

Mar 05, 2022 | 4:11 PM

ఉత్తరప్రదేశ్ సుదీర్ఘంగా సాగిన అసెంబ్లీ ఎన్నికలు(UP assembly Elections) ముగింపు దశకు చేరుకున్నాయి. మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ, ఎలాగైనా పాగా వేయాలని ఎస్పీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చివరి విడతైన ఏడో దశలో..

పీక్ స్టేజ్ కు యూపీ పోరు.. ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కీలకం కానున్న ఆ ఇరువురి కలయిక
Sp Mamatha
Follow us on

యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో మమతా బెనర్జీ-అఖిలేష్ యాదవ్ కలయిక పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎస్పీ ఎన్నికల పోరు అఖిలేష్ యాదవ్ కేంద్రంగా జరిగినప్పటికీ.. చివరి దశలో మమతా బెనర్జీ రాకతో జాతీయ వేదికపై ‘సోదర-సోదరీ’ కలయిక ఆవిష్కృతమైంది. అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీని “దీదీ” అని పిలుస్తుంటారు. “మమతా దీదీ, ఆమె సోదరుడు (అఖిలేష్) కలిసి ఉన్న ఆలోచనే బీజేపీని కలవరపెట్టింది” అని అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో సుదీర్ఘంగా సాగిన అసెంబ్లీ ఎన్నికలు(UP assembly Elections) ముగింపు దశకు చేరుకున్నాయి. మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ, ఎలాగైనా పాగా వేయాలని ఎస్పీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చివరి విడతైన ఏడో దశలో 54 నియోజకవర్గాల్లో తమ పార్టీని గెలిపించుకునేందుకు అభ్యర్థులు తీవ్ర పోటీ పడుతున్నారు. వారణాసి(Varanasi) లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం వహించగా.. బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ ప్రణాళికలు రూపొందిస్తోంది.

సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల విజయ అవకాశాలను పెంచేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Benarjee) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2021లో పశ్చిమ బెంగాల్ మాదిరిగానే, 2022లో యూపీలోనూ జరుగుతుందని ఆమె అన్నారు. ఎన్నికల చివరి దశలో అఖిలేష్ యాదవ్ కు మమతా బెనర్జీ మద్దతివ్వడంతో జాతీయ వేదికపై ‘సోదర-సోదరీ’ కలయిక ఆవిర్భవించినట్లు భావిస్తున్నారు.  కాశీ ప్రాంతంలో పోరు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఎస్పీ తన మిత్రపక్షాలతో కలిసి కాషాయ దళం స్థావరంలో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఈ దశలో ఎన్నికలు జరిగే 54 నియోజకవర్గాల్లో రెండు వైపులా కూటమి భాగస్వాముల పాత్ర ప్రాముఖ్యతను సంతరించుకుంది. కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ నేతృత్వంలోని బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్(ఎస్).. గత రెండు దశల్లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది. ఎస్పీ మిత్రపక్షాలు ఎస్‌బిఎస్‌పి 18 స్థానాల్లో పోటీ చేస్తుండగా, అప్నా దళ్ (కెమెరవాడి) చివరి దశలో ఆరు స్థానాల్లో పోటీ చేస్తోంది.

గత ఐదేళ్లలో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కాశీ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవడానికి చాలా పెట్టుబడి పెట్టింది. రూ.750 కోట్లు అంచనా వ్యయంతో కాశీ విశ్వనాథ్ కారిడార్ (KVC) అభివృద్ధిని పార్టీ మెగా ఎన్నికల ప్రాజెక్టుగా భావించారు, ఈ ప్రాజెక్టును డిసెంబర్ 13, 2021న ప్రధాని మోడీ ప్రారంభించారు. రాష్ట్రంలో మార్చి 7వ తేదీన ఏడో దశ పోలింగ్ జరుగనుంది. మార్చి 10వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఇవీచదవండి.

Ravi Teja: ఓటీటీలో సందడి చేయనున్న మాస్ రాజా మూవీ.. ఖిలాడి స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..

Golden Hour: గుండెపోటులో కీలకంగా ‘గోల్డెన్ అవర్’.. అంటే ఏమిటి, అసలేం చేయాలి?

Russia-Ukraine War: రష్యాకు షాకిచ్చిన టెక్ దిగ్గజం శాంసంగ్‌ కంపెనీ..!