Karnataka: కాంగ్రెస్ నేతలు 91 సార్లు దూషించారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యాలపై రాహుల్ గాంధీ స్పందన

ఇటీవల ప్రధాని మోదీ.. కాంగ్రెస్ నాయకులు తనను 91 సార్లు దూషించారంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కర్ణాటక ఎన్నికలు ప్రధాని మోదీ కోసం జరగడం లేవని.. ఆ రాష్ట్ర ప్రజల కోసం జరుగుతున్నాయని అన్నారు.

Karnataka: కాంగ్రెస్ నేతలు 91 సార్లు దూషించారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యాలపై రాహుల్ గాంధీ స్పందన
Rahul Gandhi

Updated on: May 01, 2023 | 6:02 PM

ఇటీవల ప్రధాని మోదీ.. కాంగ్రెస్ నాయకులు తనను 91 సార్లు దూషించారంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కర్ణాటక ఎన్నికలు ప్రధాని మోదీ కోసం జరగడం లేవని.. ఆ రాష్ట్ర ప్రజల కోసం జరుగుతున్నాయని అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని.. రాష్ట్రం గురించి కాకుండా తన గురించి తానే మాట్లాడుకుంటున్నారని విమర్శించారు. గత మూడేళ్లుగా రాష్ట్రం కోసం బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రధాని చెప్పాలన్నారు. ప్రసంగాలు చేసేపటప్పుడు రాబోయే ఐదేళ్లలో ఏ పనులు చేస్తారో వివరించాలని తెలిపారు. యువత, విద్య, ఆరోగ్యం, అవినీతిపై పొరాటానికి ఎలాంటి చర్యలు చేపడతారని ప్రశ్నించారు.

 

ప్రధాని కర్ణాటకకి వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ నాయకులైన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లాంటి వారిపై, వాళ్ల పనుల గురించి మాట్లాడుతారని.. బీజేపీ నేతలైన సీఎం బసవాజ్ బొమ్మై, మాజీ సీఎం యెడియురప్ప గురించి మాట్లాడరని ఆరోపించారు. ఒకటి, రెండు సార్లు మీ పార్టీ నేతల పేర్లు కూడా ప్రస్తావిస్తే వారు కూడా సంతోషిస్తారన్నారు. అలాగే గత మూడేళ్లుగా కర్ణాటకలో ప్రభుత్వం ద్వారా జరిగే ఎలాంటి పనుల్లో అయిన 40 శాతం కమీషన్ తీసుకునే అవినీతికి బీజేపీ పాల్పడుతోందంటూ విమర్శించారు.

ఇవి కూడా చదవండి

 

పన్ను సొమ్ముకు సంబంధించి కర్ణాటకకు రావాల్సిన షేర్‌‌ తీసుకురావడానికి ఏం చేశారో ప్రధాని చెప్పాలన్నారు. వరదలు వచ్చినప్పుడు రాష్ట్రానికి ఎలా సహాయం చేశారో.. కర్ణాటక, మహారాష్ట్ర, గోవాల మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించేందుకు ఎలాంటి ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. 40 శాతం అవినీతిలో కూరుకుపోయిన బీజేపీకి 40 సీట్లు మాత్రమే వస్తాయన్నారు. కాంగ్రెస్‌కు కనీసం 150 సీట్లు ఇవ్వాలని కోరారు. ఇలా చేస్తే బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేలను కొనలేరని.. ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చలేరని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..