Goa Elections 2022: కౌంటింగ్ డే.. మనోహర్ పారికర్ సాంప్రదాయాన్ని కొనసాగించిన గోవా సీఎం ప్రమోద్.. పూర్తి వివరాలు

|

Mar 10, 2022 | 8:45 AM

Goa Election Results Updates: ధివంగత మనోహర్ పారికర్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గోవా సీఎం ప్రమోద్ సావంత్ తన నియోజకవర్గం సాంక్వెలిమ్‌లోని శ్రీ దత్త మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Goa Elections 2022: కౌంటింగ్ డే.. మనోహర్ పారికర్ సాంప్రదాయాన్ని కొనసాగించిన గోవా సీఎం ప్రమోద్.. పూర్తి వివరాలు
Goa CM Pramod Swant (File Photo)
Follow us on

Goa Election Results Updates: ధివంగత మనోహర్ పారికర్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గోవా సీఎం ప్రమోద్ సావంత్ తన నియోజకవర్గం సాంక్వెలిమ్‌లోని శ్రీ దత్త మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు గురువారం ఉదయాన్నే ఆయన ఆలయానికి చేరుకున్నారు. బీజేపీ విజయం కోసం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి, గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ కూడా గతంలో ఎన్నికల కౌంటింగ్ నాడు ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసేవారు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రమోద్ సావంత్ కూడా కౌంటింగ్ డే సందర్భంగా ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గం.లకు ప్రారంభమయ్యింది. మరో రెండు మూడు గంటల వ్యవధిలోనే అక్కడ అధికారం ఎవరిదన్న విషయంలో స్పష్టత వచ్చే అవకాశముంది.

గోవాలో ఉదయం 8 గం.లకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ ఓపన్ చేశారు. అందులోని ఈవీఎంలను పటిష్ట బందోబస్తు మధ్య కౌంటింగ్ హాల్స్‌కు తరలించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. అనంతరం ఈవీఎంల  ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. అక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో తేలింది.

Also Read..

Petrol-Diesel Price Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయా…? తాజాగా ఏ నగరంలో ఎంత..?