Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election Results 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. గెలుపు గుర్రాలు ఎవరో..?

Election Results 2022 Updates: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు చేపడుతున్నారు.

Election Results 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. గెలుపు గుర్రాలు ఎవరో..?
Up Elections
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 10, 2022 | 8:30 AM

ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో కౌంటింగ్ మొదలైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నారు. యూపీలో బీజేపీ, ఎస్పీ, పంజాబ్‌లో ఆప్‌కు, కాంగ్రెస్‌కు మధ్య టఫ్‌ ఫైట్‌ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికల్లో గెలుపు తమదేనని అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. పంజాబ్ లో గెలుపుపై ధీమాతో అప్పుడే ఆప్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. గోవాలో కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. ఉత్తరాఖండ్‌లోనూ జోరుగా క్యాంప్‌ రాజకీయాలు మొదలయ్యాయి. మణిపూర్‌లోనూ ఫలితాలపై ఉత్కంఠ తలెత్తింది.

UP Assembly Election Results 2022 Live Updates: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడి అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh), ఉత్తరాఖండ్(Uttarakhand), గోవా(Goa), మణిపూర్(Manipur), పంజాబ్(Punjab) ప్రజలు తమ ఓటును వినియోగించుకున్నారు. యావత్‌ దేశం చూపు యూపీపైనే. ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీ గెలవబోతోందనేది దేశం మొత్తం ఆసక్తి రేపుతోంది. జనరల్‌ ఎలక్షన్స్‌లో ఢిల్లీ పీఠాన్ని నిర్ణయించగలిగే శక్తున్న అతిపెద్ద రాష్ట్రంలో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారనేది తెలుసుకునేందుకు ప్రజలంతా ఇంట్రెస్ట్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే, యూపీ పీఠం మళ్లీ బీజేపీదే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్‌. ఒకటి కాదు రెండు కాదు, ఏ సంస్థ సర్వే చూసినా అదే రిజల్ట్‌. అన్ని సర్వే సంస్థలన్నీ ఏకపక్షంగా బీజేపీకే పట్టం కడుతున్నాయి. మరి, ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమవుతాయా? లేక బోల్తా కొడతాయా? ఒరిజినల్‌ రిజల్ట్స్‌ ఎలా ఉండబోతున్నాయ్‌? కాసేపట్లో తేలిపోనుంది.

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు ఫిబ్రవరి 10న మొదటి దశ ఓటింగ్‌తో ప్రారంభమై మార్చి 7న ఏడో రౌండ్ పోలింగ్‌తో ముగిశాయి. ఉత్తరప్రదేశ్‌లో 403, పంజాబ్‌లో 117, గోవాలో 40, ఉత్తరాఖండ్‌లో 70, మణిపూర్‌లో 60 స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. మెజారిటీ సంఖ్య ఉత్తరప్రదేశ్‌లో 202, గోవాలో 21, ఉత్తరాఖండ్‌లో 36, మణిపూర్‌లో 31, పంజాబ్‌లో 59. అంటే ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీ అయినా ఇన్ని సీట్లు గెలవాలి. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో 4 చోట్ల బీజేపీ ప్రభుత్వం ఉంది. పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, గోవా, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో ‘కమలం’ వికసిస్తోంది.

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అద్భుతాలు చేయగలడా? యూపీ సీటు ఎవరికి దక్కుతుందనేది నేడు తేలనుంది. యోగి ఆదిత్యనాథ్ తన ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చినట్లయితే, ఆ పని చేసిన మొదటి ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన భారతీయ జనతా పార్టీ తొలి ముఖ్యమంత్రి ఆయనే. యోగి ముఖ్యమంత్రి అయితే.. 2007 తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన తొలి నాయకుడు.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 325 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత పార్టీ అధికారాన్ని యోగి ఆదిత్యనాథ్‌కు అప్పగించింది. యోగి ఆదిత్యనాథ్ తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. ఇక, ఇప్పుడు కూడా కాషాయ పార్టీదే గవర్నమెంట్‌ అంటున్నాయి ఎగ్జిట్ పోల్, ఫ్రీపోల్ సర్వేలు. ఈసారి అన్ని సీట్లు రాకపోయినా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ను బీజేపీ సాధిస్తుందని చెబుతున్నాయి. మరి యోగి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి చరిత్ర సృష్టించగలడా అనేది చూడాలి.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.