Goa Assembly Elections 2022: త్వరలో జరుగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. ఆ రాష్ట్ర రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలపై దృష్టి పెడుతున్నాయి. ఇదిలా ఉంటే సీట్ల విషయంలో అసంతృప్తి స్వరం కూడా శరవేగంగా పెరగడం మొదలైంది. ప్రస్తుతం గోవాలో పంజిమ్ సీటుపై నిరసనలు కొనసాగుతున్నాయి. పనాజీ సీటుపై ఆశలు పెట్టుకున్న బీజేపీ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్‌కు ఉహించని షాక్ తగిలింది. గోవా ఎన్నికల్లో పనాజీ నుంచి పోటీ చేయాలన్న ఆయన డిమాండ్‌పై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేసింది.
ఉత్పల్ పారికర్ డిమాండ్‌ను తోసిపుచ్చిన బీజేపీ గోవా ఎన్నికల ఇన్‌ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవిస్, ఎవరో ఒకరి నాయకుడి కొడుకు అనే కారణంగా తమ పార్టీ టిక్కెట్లు ఇవ్వదని ధృవీకరించారు. దీనికి అర్హతే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఏం చర్చ జరిగిందో నాకు తెలియదు. సమాచారం వచ్చిన తర్వాతే నా అభిప్రాయం తెలియజేస్తాను. 2019 లో తన తండ్రి అకాల మరణం తరువాత, ఉత్పల్ పారికర్ పనాజీలో తదుపరి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే తన కోరికను బహిరంగపరిచాడు. అయితే సిద్ధార్థ్ కుంకలింకర్‌కు బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. అని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు కొనసాగుతుందన్నారు. అధిష్టానంతో చర్చించి అభ్యర్థుల జాబితాపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
పనాజీ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని మనోహర్ పారికర్ పెద్ద కుమారుడు భావించారు. అయితే, కుటుంబీకులను ప్రోత్సహించడం లేదనే కారణంతో ఉత్పల్ పారికర్‌కు టికెట్ ఇవ్వడానికి బీజేపీ నిరాకరించింది. అయితే, ఇప్పుడు కూడా బీజేపీ అదే మాట చెబుతోంది. మనోహర్ పారికర్ జీవించి ఉన్నంత కాలం. అప్పటి వరకు ఉత్పల్ రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. అయితే, ఇప్పుడు అతను తన తండ్రి రాజకీయ వారసత్వంపై తన వాదనను నిరంతరం ప్రదర్శిస్తున్నాడు. తనకు పనాజీ సీటు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని కొంతకాలం క్రితం చెప్పారు.
బీజేపీ తనకు టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఉత్పల్ పారికర్ బెదిరించారని, అయితే అమిత్ షా మాత్రం అలా చేయకుండా తొందరపడవద్దని సూచించినట్లు సమాచారం. జనవరి 8న భారత ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఓటర్ల జాబితాలో 11,56,762 మంది ఓటర్లు నమోదు కాగా, పోలింగ్ కేంద్రాలను 1,722కు పెంచారు. కోవిడ్ 19 పరిస్థితి దృష్ట్యా, అన్ని ర్యాలీలు, రోడ్ షోలను జనవరి 15 వరకు నిషేధించింది కేంద్ర ఎన్నికల సంఘం.
Read Also… Uttakhand Election: ఎన్నికలు వాయిదా వేయడం కోర్టు పని కాదు.. తేల్చి చెప్పిన ఉత్తరాఖండ్ హైకోర్టు