Assembly Elections: 5 రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ఊరట.. నిబంధనలు సడలించిన కేంద్ర ఎన్నికల సంఘం

|

Feb 13, 2022 | 8:34 AM

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం.. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రచార నిబంధనలను మరింత సడలించింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఇప్పటికే ఉన్న అన్ని సూచనలను అనుసరించి ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేయవచ్చు.

Assembly Elections: 5 రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ఊరట.. నిబంధనలు సడలించిన కేంద్ర ఎన్నికల సంఘం
Eci
Follow us on

ECI on Assembly Elections 2022: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం.. కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) శనివారం ప్రచార నిబంధనలను మరింత సడలించింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఇప్పటికే ఉన్న అన్ని సూచనలను అనుసరించి ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేయవచ్చు. సంబంధిత స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీల (SDMA) మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల రాష్ట్రాల్లో పాదయాత్రలను కూడా కమిషన్ అనుమతించింది. దేశంలో ముఖ్యంగా పోలింగ్ రాష్ట్రాల్లో కోవిడ్ 19 మహమ్మారి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈక్రమంలోనే కోవిడ్‌(Covid 19) పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌తో ఎన్నికల సంఘం సమావేశమైంది. దేశంలో కోవిడ్‌ పరిస్థితి చాలా మెరుగుపడిందని, కేసులు వేగంగా తగ్గుతున్నాయని సమీక్షా సమావేశంలో వెల్లడించారు.

అంతకుముందు, కమిషన్ రోడ్ షోలు, పాదయాత్రలు, వాహనాల ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధాన్ని ఫిబ్రవరి 11 వరకు పొడిగించింది. అయితే, అన్ని దశలకు ఇంటింటికీ ప్రచారం, బహిరంగ సభల సంఖ్యకు సంబంధించిన నిబంధనలను సడలించింది. ఇచ్చిన మినహాయింపు ప్రకారం, ఇంటింటికీ ప్రచారం చేసే వారి సంఖ్యను 10 నుండి 20కి పెంచారు. గరిష్టంగా 1,000 మంది ఇప్పుడు బహిరంగ సభలకు హాజరు కావచ్చు. ఇండోర్ మీటింగ్‌లకు హాజరయ్యే వారి గరిష్ట సంఖ్యను ఇప్పుడున్న 300 మంది నుండి 500 మందికి కమిషన్ పెంచింది. అయితే, రాజకీయ కార్యకలాపాల వల్ల ఇన్ఫెక్షన్ కేసులు పెరగకుండా కోవిడ్ ప్రోటోకాల్ జాగ్రత్తలు కొనసాగించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర అధికారులు తెలిపారు.

ఎన్నికలేతర రాష్ట్రాల నుండి ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ, దేశంలో నమోదైన మొత్తం కేసులకు ఎన్నికల రాష్ట్రాల సహకారం చాలా తక్కువగా ఉంది. కోవిడ్ గణాంకాల గురించి మాట్లాడితే, జనవరి 21న దాదాపు 3.47 లక్షలు వచ్చాయి. అది శనివారం అంటే ఫిబ్రవరి 12 నాటికి దాదాపు 50,000కి తగ్గింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాలలో మొత్తం కరోనా కేసుల సంఖ్య జనవరి 22 నాటికి 32,000 కంటే ఎక్కువగా ఉంది. ఇది ఫిబ్రవరి 12 నాటికి 3,000 కి తగ్గింది.

COVID 19 కేసుల పెరుగుదలను ఉటంకిస్తూ, కమిషన్ జనవరి 8 న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్‌లలో పోలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించేటప్పుడు భౌతిక ర్యాలీలు, రోడ్ షోలు, పాదయాత్రలను నిషేధించింది. మహమ్మారి పరిస్థితిని కమిషన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కొన్ని సడలింపులు ఇస్తోంది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా సాగుతుండగా, అన్ని రాజకీయ పార్టీల అగ్రనేతలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఒక్కో పార్టీ ఒక్కో ఎత్తుగడ వేస్తున్నారు.


Read Also… Telangana Gateway: తెలంగాణకు మరో మణిహారం.. కండ్లకోయలో రూ. 100 కోట్లతో భారీ ఐటీ పార్క్