Assembly Polls in 5 States: ఐదు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్‌.. రూ.1766 కోట్ల విలువైన నగదు సీజ్‌

|

Dec 01, 2023 | 8:52 AM

తెలంగాణతో సహా రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం.. ఐదు రాష్ట్రాల్లో ఓటింగ్‌ ప్రక్రియ గురువారం (నవంబర్‌ 30)తో ముగిసింది. ఇప్పటికే ఎగ్జిట్‌పోల్‌ ప్రిడిక్షన్‌లు కూడా ప్రకటించారు. శాసనసభ ఎన్నికలు జరిగిన అయిదు ఈ రాష్ట్రాల్లో ఏయే పార్టీలు గెలిచే అవకాశం ఉందనే విషయంలో వేర్వేరు సంస్థలు తమతమ అంచనాలను గురువారం సాయంత్రం ‘పోల్‌ ఆఫ్‌ పోల్స్‌’ పేరుతో వెల్లడించాయి. ఇక ఆదివారం ఓట్ల తుది ఫలితాలు రానున్నాయి. నెల రోజులుగా ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌..

Assembly Polls in 5 States: ఐదు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్‌.. రూ.1766 కోట్ల విలువైన నగదు సీజ్‌
Election Commission
Follow us on

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 1: తెలంగాణతో సహా రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం.. ఐదు రాష్ట్రాల్లో ఓటింగ్‌ ప్రక్రియ గురువారం (నవంబర్‌ 30)తో ముగిసింది. ఇప్పటికే ఎగ్జిట్‌పోల్‌ ప్రిడిక్షన్‌లు కూడా ప్రకటించారు. శాసనసభ ఎన్నికలు జరిగిన అయిదు ఈ రాష్ట్రాల్లో ఏయే పార్టీలు గెలిచే అవకాశం ఉందనే విషయంలో వేర్వేరు సంస్థలు తమతమ అంచనాలను గురువారం సాయంత్రం ‘పోల్‌ ఆఫ్‌ పోల్స్‌’ పేరుతో వెల్లడించాయి. ఇక ఆదివారం ఓట్ల తుది ఫలితాలు రానున్నాయి. నెల రోజులుగా ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. ఈ నెల రోజుల్లో దాదాపు 1766 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఫ్రీబీలు, డ్రగ్స్, నగదు, మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఉచిత తాయిలాలు తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాయి. తెలంగాణలో రూ.745 కోట్ల విలువైన డబ్బు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను అధికారులు సీజ్‌ చేశారు.

స్థానిక ఎన్నికల యంత్రాంగం నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఇన్‌పుట్‌ల ఆధారంగా ఎలక్షన్‌ కమిషన్‌ ప్రముఖ రాజకీయ నాయకులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ప్రత్యర్థి పార్టీల ఫిర్యాదుల ఆధారంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావులకు ఈసీ నోటీసులు జారీ చేసింది. బాధ్యతాయుతంగా మోడల్‌ కోడ్‌ అనుసరింమని ఈసీ కోరింది. అయితే తెలంగాణలో మాత్రం ఎన్నికల మోడల్‌ కోడ్‌ అమలులో ఉన్న సమయంలో రైతు బందు పథకం కింద తదుపరి ఇన్‌స్టాల్‌మెంట్‌ నగదు రైతుల ఖాతాలకు మళ్లించేందుకు ప్రయత్నించింది. కొన్ని కారణాలతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వ్యవధిలో రబీ వాయిదాను పంపిణీ చేయడానికి పోల్ ప్యానెల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర, పథకాలు, కార్యక్రమాలపై దాని మెగా ఔట్రీచ్ కార్యక్రమాలు డిసెంబర్ 5 వరకు ఈ ఐదు రాష్ట్రాల్లో నిర్వహించవద్దని ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వాన్ని కోరింది.

తెలంగాణలోని ఎన్నికలకు సంబంధించి వార్తాపత్రికలలో వచ్చిన ప్రకటనలపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈసీ వివరణ కోరింది. ప్రకటనలను ప్రచురించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి పొందలేదని, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన చర్యేనని కర్ణాటక ప్రభుత్వానికి పంపిన ఉత్తర్వుల్లో కమిషన్ పేర్కొంది. కమీషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అనుమతులు తీసుకునే వరకు తెలంగాణలో కర్ణాటక ప్రభుత్వం ప్రకటనల ప్రచురణను వెంటనే నిలిపివేయాలని ఈసీ పేర్కొంది. కాగా ఎన్నికల కమిషన్‌ అందించిన సమాచారం మేరకు.. 2018 మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీజ్‌ చేసిన నగదుతో పోలిస్తే ఈసారి దాదాపు 7 రెట్లు (రూ.1766 కోట్లు) అధికంగా పట్టుబడినట్లు తెల్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.