అస్సాంలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయం, ఎన్సీపీ నేత శరద్ పవార్ జోస్యం,

| Edited By: Anil kumar poka

Mar 15, 2021 | 10:51 AM

త్వరలో నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క అస్సాం రాష్ట్రంలో తప్ప మిగిలిన అన్ని చోట్లా ఓడిపోవడం ఖాయమని ఎన్సీపీ నేత శరద్జ పవార్  అన్నారు.

అస్సాంలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయం, ఎన్సీపీ నేత శరద్ పవార్ జోస్యం,
Sharad Pawar
Follow us on

త్వరలో నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క అస్సాం రాష్ట్రంలో తప్ప మిగిలిన అన్ని చోట్లా ఓడిపోవడం ఖాయమని ఎన్సీపీ నేత శరద్జ పవార్  అన్నారు. ముఖ్యంగా బెంగాల్  ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తన అధికారాన్ని దుర్వినియోగపరుస్తోందని ఆయన ఆరోపించారు. పూణే జిల్లాలోని బారామతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే మాట్లాడడం తొందరబాటే అవుతుందని, కేరళకు సంబంధించినంతవరకు లెఫ్ట్ పార్టీలతో ఎన్సీపీ చేతులు కలిపిందని, ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఈ కూటమి విజయం తథ్యమని పేర్కొన్నారు. తమిళనాడులో ఓటర్లు డీఎంకేకి, ఆపార్టీ నేత స్టాలిన్ కి  మద్దతు ఇస్తారని, ఎన్నికల అనంతరం ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని పవార్ చెప్పారు.  అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ నానా ప్రయత్నాలు చేస్తోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, సోదరి (మమతా బెనర్జీ) పై దాడి చేస్తోందని ఆయన ఆరోపించారు

మొత్తం బెంగాల్ రాష్ట్రమంతా మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కి అండగా ఉందని శరద్ పవార్ చెప్పారు. బెంగాల్ రాష్ట్ర అభ్యున్నతి కోసం మమత నిరంతర పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆమె పార్టీ తిరిగి విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకు పూర్తిగా ఉందన్నారు. ఇక అస్సాంలో  బీజేపీ గెలుపు ఖాయమని అక్కడ  ఇతర పార్టీలతో పోలిస్తే ఆ పార్టీ బలంగా ఉందన్నారు.  , కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం కమలం పార్టీ ఓటమి తథ్యమనిశరద్ పవార్ అన్నారు. ఈ ట్రెండ్ దేశానికి కొత్త దిశను ఇస్తుందనడంలో సందేహం లేదని ఆయన చెప్పారు.

మరిన్ని చదవండి ఇక్కడ :
శోభనానికి అంగీకరించని భార్య ఆరాతీస్తే విస్తుపోయే నిజాలు.. షాక్ అయిన భర్త..! : Wedding viral Video
ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోగలరా ?ట్రై చేయండి..ఈ ఫన్నీ వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి.:Funny Video

‘నా సావు నేను చస్తా’ డైరెక్టర్‌గా ప్రియదర్శి : Comedian Priyadarshi to turn Director Video.