Crime News: తాడిపత్రిలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడి హత్య.. చంపి పెన్నా నదిలో..

YSRCP Leader Murder: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వైఎస్ఆర్ సీపీ నాయకుడు పోతులయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం

Crime News: తాడిపత్రిలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడి హత్య.. చంపి పెన్నా నదిలో..
Murder

Updated on: Sep 05, 2021 | 11:52 AM

YSRCP Leader Murder: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వైఎస్ఆర్ సీపీ నాయకుడు పోతులయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం పెన్నా నదిలో పోతులయ్య మృతదేహం లభ్యమైంది. మృతుడిని తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. కాగా.. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోతులయ్య మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే.. పోతులయ్యను చంపిన అనంతరం దుండగులు పెన్నా నదిలో పడేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాగా.. తాడిపత్రిలో మళ్లీ రాజకీయ హత్యలు మొదలవ్వడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పోతులయ్య హత్యతో ఈ ప్రాంతం మళ్లీ ఉలిక్కిపడింది.

Also Read:

Crime News: నమ్మకంతో నట్టేట ముంచిన మహిళ.. చిట్టీ పేరుతో రూ.5.6 కోట్ల మేర కుచ్చుటోపీ..

Crime News: దారుణం.. టీవీ మీద పడి పసిపాప మృతి.. ఆడుకుంటుండగా..

Gold smuggling: విజయవాడ పోలీసుల అదుపులో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా.. వాయు, జల మార్గాల ద్వారా రవాణా