Young woman suicide Attempt : తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరు గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యా యత్నం చేసింది. అదే గ్రామానికి చెందిన నేలపూడి సత్య నరేష్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ సదరు యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు యువతి పరిస్థితిని గమనించి స్థానిక ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. అయితే, ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటీన కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. బాధిత యువతికి ఎక్కువగా ఫిట్స్ రావడంతో 12 గంటలు గడిస్తే గాని పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారని యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.