హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడన్న కారణంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖపట్నంలోని రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన వాసర్ల అనూష.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ మధురానగర్‌లో నివాసముంటోంది. శనివారం ఆమె విధులకు రాకపోవడంతో సహోద్యోగులు ఆమె చరవాణికి ఫోన్ చేశారు. స్పందన లేకపోవడంతో సాయంత్రం ఆమె ఉంటున్న గది వద్దకు వెళ్లి చూశారు. తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో పాటు, ఎంత పిలిచినా తీయకపోవడంతో కిటికీ అద్దాలు పగులగొట్టి చూశారు. లోపల అనూష సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని విగతజీవిగా కనిపించింది.
లోపలికి వెళ్లిన అమె సహచరులు వెంటనే అనూషను కిందకు దించి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని విశాఖపట్నంలో ఉంటున్న మృతురాలి సోదరుడు అవినాష్‌కు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనూష రాసిన లేఖలో.. నవీన్ అనే వ్యక్తిని ప్రేమించానని, మోసం చేశాడని, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read
Andhra Pradesh: తండ్రిని మించిపోతున్న తనయడు.. కర్నూలులో చరిత్రను రిపీట్ చేసేనా!?
Children Overpraising: మీ పిల్లలను ఎక్కువగా ప్రశంసిస్తున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి..!