పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని యువతి ఆత్మహత్యయత్నం.. కానిస్టేబుల్ అప్రమత్తంతో తప్పిన ముప్పు.. అసలేం జరిగిందంటే.?

|

Jul 24, 2021 | 7:44 AM

మ్మేవాళ్లు ఉంటే మోసం చేసే వాళ్లు ఉండే ఉంటారు. తనను ప్రేమ పేరుతో వంచాడంటే ఓ యువతి పోలీసు స్టేషన్ ముందే బలవన్మరణానికి ప్రయత్నించింది.

పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని యువతి ఆత్మహత్యయత్నం.. కానిస్టేబుల్ అప్రమత్తంతో తప్పిన ముప్పు.. అసలేం జరిగిందంటే.?
Woman Suicide Attempt In Front Of Police Station Tadepalli
Follow us on

Woman Suicide attempt in front of police station: నమ్మేవాళ్లు ఉంటే మోసం చేసే వాళ్లు ఉండే ఉంటారు. తనను ప్రేమ పేరుతో వంచాడంటే ఓ యువతి పోలీసు స్టేషన్ ముందే బలవన్మరణానికి ప్రయత్నించింది. ఇది గమనించిన స్థానికులు అప్రమత్తం అవ్వడంతో ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి పోలీసు స్టేషన్ ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఎస్ఐ బాలకృష్ణ మోసం చేశాడంటూ ఆ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. ఆ యువతిని పోలీసులు అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు.

తాడేపల్లి పోలీసుస్టేషన్‌ ఎదుట ఓ యువతి ఎస్సై తనను మోసం చేశారంటూ తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని శుక్రవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. గుంటూరుకు చెందిన యువతి తనకు తాడేపల్లి ఎస్సై బాలకృష్ణ అన్యాయం చేశారంటూ, తల్లితో కలిసి పోలీస్‌స్టేషన్‌ ఎదుట రహదారిపై ఆందోళనకు దిగింది. ప్రేమ పేరుతో మోసడని, తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. అయితే, అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆమెను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు.

దీంతో ఆమె తన వెంట సీసాలో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే సీసా లాక్కుని ఆమెపై నీళ్లు చల్లారు. వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం స్టేషన్‌లోకి తీసుకెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఐ శేషగిరిరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 2019లో ఈ సంఘటన జరిగిందని, అప్పట్లోనే పోలీసులకు యువతి ఫిర్యాదు చేసిందని, దీంతో సదరు ఎస్ఐపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోందన్నారు. ఘటనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు తదుపరి చర్యలుంటాయని ఆయన వివరించారు.

Read Also…

రెండో డిప్యూటీ మేయర్, రెండో వైఎస్ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్.. ఈ నెల 30న పురపాలికల ప్రత్యేక సమావేశం