Black Market of medicines : అత్యవసర ఇంజక్షన్లు కొని బ్లాక్ లో భారీ మొత్తానికి అమ్ముతోన్న హైదరాబాద్ యువకుడు అరెస్ట్

|

Jun 10, 2021 | 11:53 AM

అకారణంగా, అర్థాంతరంగా మీదకి వచ్చి పడుతోన్న కరోనా మహమ్మారితో అసలే ప్రజలంతా సతమతమవుతుంటే, దీనిని సందట్లో సడేమియాగా మార్చకుంటున్నారు..

Black Market of medicines : అత్యవసర ఇంజక్షన్లు కొని బ్లాక్ లో భారీ మొత్తానికి అమ్ముతోన్న హైదరాబాద్ యువకుడు అరెస్ట్
Black Market Of Medicines
Follow us on

Medicines Black Market : అకారణంగా, అర్థాంతరంగా మీదకి వచ్చి పడుతోన్న కరోనా మహమ్మారితో అసలే ప్రజలంతా సతమతమవుతుంటే, దీనిని సందట్లో సడేమియాగా మార్చకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ప్రాణాల మీదకొచ్చినప్పుడు ఉపయోగించే అత్యవసర మందుల్ని బ్లాక్ మార్కెట్ చేసి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరైతే, చిన్న మొత్తంలో ఇంజక్షన్లను కొనిపెట్టుకుని అవసరమైన వారికి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ ఇంటి దగ్గరే కొత్త బిజినెస్ పెట్టుకుంటున్నారు. ఇదే కోవకు చెందిన ఒక యువకుడి బాగోతాన్ని హైదరాబాద్ ఎల్బీనగర్ ఎస్ఓటీ టీం రట్టు చేసింది.

అందిన సమాచారం మేరకు హైదరాబాద్ కూకట్ పల్లి ప్రగతి నగర్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల మనీష్ అనే విద్యార్థి ఇంట్లో దాడి చేసిన పోలీసులు అతని దగ్గర్నుంచి అమ్ఫోటెరిసిన్ బి ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంజక్షన్లను అనధికారికంగా ఒక్కొక్కటి రూ. 35,000 / – చొప్పున అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యల కోసం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలాఉండగా,

మరోవైపు, ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయలేక , ఆసుపత్రులలో లేవని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో సామాన్యులు దీనంగా రోదిస్తున్నారు. కరోనా మహమ్మారి బారిన పడి శ్వాసకోశ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారి బంధువులు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కోసం పరుగులు పెడుతున్న ఉదంతాలు ఎన్నో ఉంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఇంజెక్షన్లు అందుబాటులో లేవని వైద్యులు చెబుతున్న పరిస్థితులతో బ్లాక్ లో కొనుగోలు చేసైనా ప్రాణాలు నిలుపుకునేందుకు జనం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇదో బిజినెస్ గా మార్చకుంటున్నారు కొందరు అక్రమార్కులు.

కాగా, తెలుగు రాష్ట్రాలలో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను ఇప్పటికే బ్లాక్ చేసిన అక్రమార్కులు, బాధితుల అవసరాన్ని బట్టి విపరీతమైన ధరలు పెంచి విక్రయిస్తున్నారు . రెమ్‌డెసివిర్ అసలు ధర దాదాపు 3,000 రూపాయలు గా ఉంటే, దానికి పది రెట్లు పెంచి 30 వేల రూపాయలు గా విక్రయిస్తున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్ అవుతుంది . ఏ ఆస్పత్రికి వెళ్ళినా ఇంజక్షన్ లు లేవు అనే పదమే ముందు వెలుగు చూస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించి, కరోనా వైద్యానికి కావలసిన అన్ని మందులను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు సామాన్య ప్రజానీకం.

Read also : Pendurthi : విశాఖ జిల్లాలో బొగ్గు లారీ బీభత్సం.. విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి బైకులు, ఆటోలు, తోపుడుబండ్లు పైకి దూసుకెళ్లిన వైనం