మిత్రుల మోసం భరించలేక యువకుడి ఆత్మహత్య

|

Jul 10, 2020 | 12:58 PM

కష్టాల్లో ఉన్న స్నేహితులను ఆదుకోవాలకున్న పాపానికి అదే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. అప్పుల్లో ఉన్న మిత్రులకు ఆర్థిక సాయం చేశాడు. తిరిగి చెల్లించమన్నందుకు వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో తనను స్నేహితులు మోసగించారని మనస్తాపానికి గురైన ఒక యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మిత్రుల మోసం భరించలేక యువకుడి ఆత్మహత్య
Follow us on

కష్టాల్లో ఉన్న స్నేహితులను ఆదుకోవాలకున్న పాపానికి అదే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. అప్పుల్లో ఉన్న మిత్రులకు ఆర్థిక సాయం చేశాడు. తిరిగి చెల్లించమన్నందుకు వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో తనను స్నేహితులు మోసగించారని మనస్తాపానికి గురైన ఒక యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఏలూరు రామ కృష్ణాపురానికి చెందిన నెల్లి ఫణికుమార్‌ (27) తాపీ మేస్త్రీగా పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు కాలం చేయడంతో సోదరికి పెళ్లి చేసి, ఒంటరిగా ఉంటున్నాడు. తన స్నేహితులైన గణపతి, రాజేశ్‌లు ఆర్థిక అసరాల దృష్ట్యా డబ్బు సాయం కావాలని ఫణికుమార్ ను అడిగారు. దీంతో తన వద్ద డబ్బులు లేకున్నా, ఇతర తెలిసిన వారి వద్ద నుంచి రూ.మూడు లక్షలు ఒకరికి, రూ.నాలుగు లక్షలు మరొకరికి అప్పుగా ఇప్పించాడు. వీరిద్దరికి ఫణికుమార్‌ జామీనుగా ఉన్నాడు. వారిద్దరీ అప్పు సొమ్ము చెల్లించకుండా తాము కట్టలేమంటూ తప్పించుకు తిరుగుతున్నారు. ఇటు అప్పు ఇచ్చినవారు ఒత్తిడి పెరిగింది. అటు మిత్రులు అప్పు తీర్చలేమని తేల్చిచెప్పడంతో ఉద్దేశ్య పూర్వకంగానే తానను మోసం చేశారని భావించిన ఫణికుమార్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జీవితంపై విరక్తితో చనిపోతున్నట్లు సూసైడ్‌ నోట్‌ రాసి తన ఇంట్లోనే కరెంటు వైరుతో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.