Crime News: హైదరాబాద్‌లో మరో దారుణం.. అర్ధరాత్రి యువ‌తి ఇంటికెళ్లి ప్రేమోన్మాది ఘాతుకం.. కత్తితో దాడి..

Hyderabad Crime News: హైద‌రాబాద్ నగరంలో యువతులపై వరుస సంఘటనలు కలకలం రేపుతున్నాయి. గ‌చ్చిబౌలి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని వ‌ట్టినాగుల‌ప‌ల్లిలో దారుణం

Crime News: హైదరాబాద్‌లో మరో దారుణం.. అర్ధరాత్రి యువ‌తి ఇంటికెళ్లి ప్రేమోన్మాది ఘాతుకం.. కత్తితో దాడి..
Crime News

Updated on: Oct 28, 2021 | 11:34 AM

Hyderabad Crime News: హైద‌రాబాద్ నగరంలో యువతులపై వరుస సంఘటనలు కలకలం రేపుతున్నాయి. గ‌చ్చిబౌలి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని వ‌ట్టినాగుల‌ప‌ల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న ప్రేమ్‌సింగ్ అనే యువ‌కుడు ఓ యువ‌తి ఇంట్లోకి చొర‌బ‌డి ఆమెపై హ‌త్యాయ‌త్నం చేశాడు. ప్రేమను నిరకరించిందని.. ప్రేమ సింగ్ యువతి ఇంట్లోకి చొరబడి అమ్మాయి గొంతు, చేతులు, కాలు మనికట్టు కోసి బంధించాడు. ఈ క్రమంలో ఆ యువతి గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో బంధువులు, స్థానికులు అప్రమత్తమయ్యారు. అనంతరం ఇంట్లో ఉన్న ప్రేమ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని చిత‌క‌బాదారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రేమ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. యువకుడి దాడిలో.. అమ్మాయికి గాయాలు కావ‌డంతో చికిత్స నిమిత్తం కాంటినెంటల్ ఆసుపత్రికి త‌ర‌లించారు. స్థానికుల దాడిలో ప్రేమ్‌సింగ్ కూడా గాయ‌ప‌డినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమ్ సింగ్ ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని వేధిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కాగా.. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించింది.

కాగా.. నిందితుడు ప్రేమ్ సింగ్ రాత్రి 2 గంటలకు ఇంట్లోకి చొరబడి కత్తితో తమ కూతురిపై దాడి చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. తన వెంట రెండు కత్తులు తీసుకొని వచ్చాడన్నారు. తాము పట్టుకునే లోపు డోర్ పెట్టేశాడని.. డోర్ పగలగొట్టి అతని పట్టుకున్నట్లు వెల్లడించారు. తాము అడ్డుకోకపోతే కూతుర్ని చంపేసేవాడని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఊరి తీయాలని వారు డిమాండ్ చేశారు.

Also Read:

IND vs PAK Match: పాకిస్తాన్ విజ‌యంపై సంబరాలు.. ముగ్గురు కాశ్మీరి విద్యార్థుల అరెస్ట్.. 

Crime News: అప్పుడు భార్యను దారుణంగా చంపాడు.. ఇప్పుడు అనుభవిస్తున్నాడు.. అసలేమైందంటే..?