భర్తను హత్య చేసి.. కరోనా ఖాతాలో వేసిన భార్య..!

కట్టుకున్న భర్తను హత్య చేసి చంపేసిన ఓ భార్య ఆ నేరాన్ని కరోనా ఖాతాలో వేసింది. అయితే పోస్ట్‌మార్టంలో అసలు నిజం బయటకు వచ్చింది. ఈ ఘటన ఢిల్లీలో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీలోని అశోక్‌విహార్‌లో శరత్ దాస్‌(46), అతడి భార్య అనిత(30) నివాసముంటున్నారు. మే 2న శరత్ నిద్రలేవకపోగా.. కరోనాతో అతడు మృతి చెందాడని ఇరుగుపొరుగు వారికి అనిత తెలిపింది. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని శరత్ కరోనాతో […]

భర్తను హత్య చేసి.. కరోనా ఖాతాలో వేసిన భార్య..!

Edited By:

Updated on: May 08, 2020 | 5:59 PM

కట్టుకున్న భర్తను హత్య చేసి చంపేసిన ఓ భార్య ఆ నేరాన్ని కరోనా ఖాతాలో వేసింది. అయితే పోస్ట్‌మార్టంలో అసలు నిజం బయటకు వచ్చింది. ఈ ఘటన ఢిల్లీలో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీలోని అశోక్‌విహార్‌లో శరత్ దాస్‌(46), అతడి భార్య అనిత(30) నివాసముంటున్నారు. మే 2న శరత్ నిద్రలేవకపోగా.. కరోనాతో అతడు మృతి చెందాడని ఇరుగుపొరుగు వారికి అనిత తెలిపింది. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని శరత్ కరోనాతో మృతిపై చెందాడని చెప్పడంపై ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. దీంతో అతడి అంత్యక్రియలు అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

పోస్ట్‌మార్టంలో శరత్ ఊపిరాడక మృతి చెందాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన స్టైల్‌లో అనితను విచారించగా.. తన భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. సంజయ్‌ అనే వ్యక్తితో తాను ప్రేమలో ఉన్నానని.. ఈ విషయంపై తరచుగా తన భర్తకు, తనకు గొడవ జరిగేదని తెలిపింది. ఈ క్రమంలోనే సంజయ్‌తో కలిసి నిద్రిస్తున్న తన భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి హతమార్చినట్లు అనిత నేరాన్ని ఒప్పుకుంది.

Read This Story Also: నైకూను పట్టించిన ‘మేకు’.. ఆ ఆఫీసర్ అలా వెళ్లడం వల్లనే..!