పదేళ్ల చిన్నోడితో పెళ్లి.. రెండేళ్లుగా కనిపించకుండాపోయిన భర్త.. కట్ చేస్తే.. ప్రియుడితో కలిసి కటకటాల్లో భార్య

పరాయి మోజులో పడి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకుంది. కట్టుకున్న వాడినే కాటికి పంపి ప్రియుడితో జల్సా చేయాలని చూసింది. బంధువుల అనుమానంతో విషయం వెలుగులోకి వచ్చి కటకటలాపాలైంది.

  • Balaraju Goud
  • Publish Date - 12:35 pm, Mon, 19 April 21
పదేళ్ల చిన్నోడితో పెళ్లి.. రెండేళ్లుగా కనిపించకుండాపోయిన భర్త.. కట్ చేస్తే.. ప్రియుడితో కలిసి కటకటాల్లో భార్య
Murder

Woman killed husband: పరాయి మోజులో పడి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకుంది. కట్టుకున్న వాడినే కాటికి పంపి ప్రియుడితో జల్సా చేయాలని చూసింది. బంధువుల అనుమానంతో విషయం వెలుగులోకి వచ్చి కటకటలాపాలైంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

తెన్‌కాశిలో భర్తను హతమార్చి ఇంట్లో పాతిపెట్టిన కేసులో రెండున్నరేళ్ల తర్వాత భార్యతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెన్‌కాశి సమీపంలోని గుత్తుకల్‌వలసు ప్రాంతానికి చెందిన తంగరాజ్‌ భార్య అభిరామి (33) బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. వీరికి కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో తంగరాజ్‌ మృతిచెందాడు. ఇలావుండగా అభిరామి తెన్‌కాశి అరుణాచలపురానికి చెందిన కన్నన్‌ కుమారుడు కాళిరాజ్‌ (23)ను వివాహమాడింది. అయితే, 2018 సెప్టెంబరులో కాళిరాజ్‌ హఠాత్తుగా కనిపించకుండాపోయాడు. ఈ విషయమై కాళిరాజ్‌ తల్లి ఉమ అభిరామిని ప్రశ్నించగా, అతడు విదేశాలకు వెళ్లినట్లు నమ్మబలికింది. అయితే, అబభిరామి మాటలకు చేతలకు పొంతనలేకపోవడంతో అనుమానం వచ్చిన కాళిరాజ్ తల్లి… పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయినప్పటికీ ఎలాంటి క్లూ లభించలేదు. ఇదే క్రమంలో రెండున్నరేళ్ల తర్వాత ఈ కేసు మలుపు తిరిగింది. అభిరామి వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా కాళిరాజ్‌ను హత్య చేసినట్లు ఒప్పుకుంది. అదే ప్రాంతంలో వర్క్‌షాపు నడుపుతున్న మారిముత్తు (23) అనే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టినట్లు తేల్చారు. దీంతో అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఇందుకు సంబంధించి అభిరామి, మారిముత్తుతోపాటు సహకరించిన మురుగేశన్‌ అనే మరో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Read Also… కరోనా కట్టడికి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు.. పబ్బులు, మద్యం దుకాణాల ఆంక్షలపై ఆరా..!