Nirbhaya case against 139 persons: తనను 139 మంది అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన 25 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మొత్తం 139 మందిపై పంజాగుట్ట పోలీసులు నిర్భయ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా ఆ లిస్ట్‌లో యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నాడు. అయితే ఓ మహిళ ఇంత మందిపై ఫిర్యాదు చేయడం, 139 మందిపై నిర్భయ కేసు నమోదు కావడం దేశ చరిత్రలోనే ఇదే మొదటికి కావడం విశేషం. అయితే గతంలోనూ తనకు పరిచయం ఉన్న అందరిపైన ఈ మహిళ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Read More:
రామ్‌కి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సూటి ప్రశ్న
‘ప్రభాస్ క్యాండీస్’.. మరోసారి ప్రేమను చాటుకున్న జపాన్‌వాసులు