చట్టాలు ఎన్ని వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాను మనిషినన్న విషయాన్ని కూడా మరిచిపోతున్న కామాందులు.. తల్లి లాంటి వదినలను కూడా వదలడం లేదు. మదమెక్కిన మృగంలా వ్యవహరిస్తూ మానవత్వానికే మాయని మచ్చని తెస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుని.. వరుసకు తల్లి లాంటి వదినపై కూడా అత్యాచారాని ఒడిగడుతున్నారు. అంతేకాదు.. ఆపై వారిపై దాడి చేస్తూ.. హత్యాయత్నానికి కూడా పాల్పడుతున్నారు. కృష్ణా జిల్లాలో జరిగిన దారుణ సంఘటన.. ఇందుకు నిదర్శనం.
వివరాల్లోకి వెళితే.. మైలవరం నియోజకవర్గం జి. కొండూరు మండలం మునగపాడులో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. మూడా బాలు అనే వ్యక్తి.. వరుసకు వదిన అయ్యే మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితా ఆగకుండా.. ఆమెపై కర్కషత్వాన్ని ప్రదర్శించాడు. కత్తితో ఆమె మర్మాంగాన్ని కోసేశాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్త స్రావమైంది. కాసేపటికి స్పృహలోకి వచ్చిన ఆమె.. విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి తెలిపింది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందించి.. ప్రాణాపాయం నుంచి కాపాడారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.