Murder: కట్నం తీసుకురాలేదని.. యాసిడ్ తాగించి చంపేశారు

ప్రస్తుత సమాజంలో వరకట్న సమస్య జటిలంగా మారింది. కట్నం(Dowry) తీసుకోవడం గానీ, ఇవ్వడం గానీ చట్టబద్ధం కాదని ప్రభుత్వాలు చెబుతున్నా..

Murder: కట్నం తీసుకురాలేదని.. యాసిడ్ తాగించి చంపేశారు
Woman Murder

Updated on: Feb 08, 2022 | 8:38 AM

ప్రస్తుత సమాజంలో వరకట్న సమస్య జటిలంగా మారింది. కట్నం(Dowry) తీసుకోవడం గానీ, ఇవ్వడం గానీ చట్టబద్ధం కాదని ప్రభుత్వాలు చెబుతున్నా.. జనంలో మార్పు రావడం లేదు. దీంతో ఆడపిల్లలకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు అడిగినంత కట్నం ఇవ్వలేదనో అదనపు కట్నం కావాలనో నిత్యం ఏదో ఒక చోట దారుణ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో అడిగినంత కట్నం తీసుకురాలేదన్న కారణంలో ఓ మహిళను అత్తింటి వారు దారుణంగా హత్య(Murder) చేశారు. బలవంతంగా యాసిడ్ తాగించి హత్య చేశారు.

యూపీలోని ముజఫర్ నగర్ లో కట్నం తీసుకురాలేదన్న కారణంతో అత్తింటి వారు దారణ ఘటనకు పాల్పడ్డారు. రేష్మ అనే మహిళను.. అడిగినంత కట్నం తీసుకురాలేదన్న కోపంతో ఆమె భర్త, అత్త హత్య చేశారు. బలవంతంగా యాసిడ్ తాగించి చంపేశారు. వరకట్నం తీసుకురావాలని రేష్మను అత్తమామలు వేధింపులకు గురి చేసేవారని.. ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు(Complaint) చేశారు. దీనికి సంబంధించి రేష్మ భర్త పర్వేజ్‌, బావలు జావేద్‌, శంషాద్‌, అత్త చమ్మీలపై కేసు నమోదు చేశారు.

Also Read

 Siddipet Firing case: జల్సాలకు బానిసై.. పోలీసులకు చిక్కి.. చివరికి.. ??

Murder: మద్యం మత్తులో దారుణం.. కూర లేదని తల్లిని చంపిన కుమారుడు..

Uniform Measurements: వివాదంగా మారిన మహిళా పోలీస్ యూనిఫామ్ కొలతల వ్యవహారం.. స్పందించిన నెల్లూరు జిల్లా ఎస్పీ..