Warangal: భార్య మరణం తట్టుకోలేక.. తొమ్మిదేళ్ళ కొడుకును చంపి, ఆత్మహత్య చేసుకున్న భర్త.. హన్మకొండలో దారుణం!

|

Apr 25, 2021 | 10:15 PM

భార్య గుండెపోటుతో చనిపోయింది.. ఆమె మరణాన్ని తట్టుకోలేని భర్త, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. ఈ సంఘటన వరంగల్ లో చోటుచేసుకుంది.

Warangal: భార్య మరణం తట్టుకోలేక.. తొమ్మిదేళ్ళ కొడుకును చంపి, ఆత్మహత్య చేసుకున్న భర్త.. హన్మకొండలో దారుణం!
Heart Attack
Follow us on

Warangal: భార్య గుండెపోటుతో చనిపోయింది.. ఆమె మరణాన్ని తట్టుకోలేని భర్త, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. ఈ సంఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. శ్రీధర్ అనే వ్యక్తి తన కుటుంబంతో వరంగల్ బ్రతుకుతెరువు కోసం వచ్చాడు. ఒక కార్ల షోరూమ్లో పని చేస్తున్నాడు. కొంత మొత్తం డబ్బు పోగేసి..మరికొంత అప్పుచేసి ఇటీవల ఒక ఇల్లు కొనుకున్నాడు. ప్రస్తుతం ఆ ఇంటి కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాడు. కరోనా పరిస్థితుల్లో డబ్బు చాలక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో అప్పులు చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. అయితే, శుక్రవారం అకస్మాత్తుగా అతని భార్య గుండెపోటుతో మరణించింది.

దీంతో మరింత బెంగ పెట్టుకున్న శ్రీధర్ తన తొమ్మిదేళ్ళ కొడుకును చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. గోడిశాల శ్రీధర్‌ (45), తిరుమల (38) దంపతులు. వీరికి విష్ణువర్దన్‌ (9) కుమారుడు ఉన్నాడు. శ్రీధర్‌ స్వస్థలం పరకాల. బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం హన్మకొండకు వలస వచ్చాడు. నగరంలోని ఓ ప్రైవేట్‌ కార్ల షోరూంలో సేల్స్‌ మేనేజర్‌గా శ్రీధర్‌ పనిచేస్తున్నాడు. పెద్దమ్మగడ్డ సమీపంలోని కాకతీయ కాలనీ ఫేజ్‌ -1లో సొంత ఇంటిని నిర్మించుకుని ఉంటున్నాడు. శ్రీధర్‌ తల్లి లీలావతి కూడా ఆ ఇంట్లోనే ఉంటోంది.

గత సంవత్సరం లాక్‌డౌన్‌ కారణంగా శ్రీధర్‌ పనిచేస్తున్న ప్రైవేట్‌ షోరూం మూతపడింది. శ్రీధర్ ఉపాధి కోల్పోయాడు. దానికి తోడు అంతకుముందే ఇంటి నిర్మా ణం కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగాయి. అప్పులిచ్చినవారు ఇంటి చుట్టూ తిరగడంతో ఆ దిగులుతో డిసెంబరు 16న శ్రీధర్ భార్య తిరుమల గుండెపోటుతో మృతి చెందింది. భార్య మృతిని శ్రీధర్‌ జీర్ణించుకోలేకపోయాడు. ఆమె లేని జీవితం తనకు వద్దనుకున్నాడు. దీంతో కొడుకు, తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

శనివారం రాత్రి కూల్ డ్రింక్ తీసుకువచ్చి అందులో పురుగుల మందు కలిపాడు. రాత్రి భోజనం చేశాకా ఆ కూల్ దరింగ్ తన కొడుకుతో తాగించాడు. తరువాత తానూ తాగేశాడు. ఉదయం ఎంతకీ ఇద్దరూ లేవకపోవ్డంతో లీలావతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే వచ్చిన పోలీసులు తలుపులు తెరిచి చూసేసరికి అప్పటికే ఆ ఇద్దరూ మరణించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Marriage: కోవిడ్ ఆసుపత్రే కల్యాణ మండపం..కరోనా పేషెంట్స్ అంతా బంధువర్గం.. వైద్య సిబ్బంది పెళ్లి పెద్దలు.. ఓ వధువు పెళ్లి!

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నుంచి ఉద్యోగ ప్రకటన.. ISUZU మోటార్స్‌లో ఉద్యోగాలు