SI Suspended: మరిపెడ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణలపై అధికారుల సీరియస్..

|

Aug 03, 2021 | 6:54 PM

SI Suspended: మహబూబాబాద్‌ జిల్లాలోని మరిపెడ ఎస్సై శ్రీనివాస్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై శ్రీనివాస్‌రెడ్డిపై వరంగల్‌ ఐజీ నాగిరెడ్డి చర్యలు తీసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ రెడ్డి..

SI Suspended: మరిపెడ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణలపై అధికారుల సీరియస్..
Si Suspended
Follow us on

మహబూబాబాద్‌ జిల్లాలోని మరిపెడ SI శ్రీనివాస్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న SI శ్రీనివాస్‌రెడ్డిపై వరంగల్‌ ఐజీ నాగిరెడ్డి చర్యలు తీసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ రెడ్డి.. తనపై అత్యాచారయత్నం చేశాడని మహిళా ట్రైనీ ఎస్సై వరంగల్ పోలీస్ కమిషనర్ లో ఆందోళనకు దిగింది. కుటుంబ సభ్యులతో కలిసి సీపీ కార్యాలయానికి వచ్చిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ బైఠాయించింది. అనంతరం, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషికి ఫిర్యాదు చేసింది. అటవీప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడని ఆరోపిస్తోంది బాధితురాలు. దీంతో అతనిపై చర్యలు తీసుకున్నారు.

రక్షణ కల్పించాల్సిన పోలీసులు …మృగాళ్లుగా మారుతున్నారు. భద్రత కల్పించాల్సిపోయి.. వాళ్లే, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఎస్సై శ్రీనివాస్ రెడ్డి.. మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు. తనతో కలిసి పనిచేస్తున్న మహిళా ఎస్సైపై అనుచితంగా ప్రవర్తించి.. వృత్తికే కలంకం తీసుకొచ్చారాయన.

అసలు ఏం జరిగింది…

వ‌రంగ‌ల్ సీపీ ప‌రిధిలో పోస్టింగ్ తీసుకున్న స‌ద‌రు ట్రైనీ ఎస్సై..SHOలున్న పోలీస్ స్టేష‌న్‌లో నెల రోజులు ప్రొహిబిష‌న్ పీరియ‌డ్‌ను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే SI ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడం పోలీసు వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తీవ్రంగా స్పందించారు.

జరిగిన సంఘటనపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మహిళా ట్రైనీ ఎస్ఐపై ఎస్సై శ్రీనివాస్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా రుజువైతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తరుణ్ జోషి తెలిపారు.

ఇవి కూడా చదవండి: Price is more Than Gold: మీకు ఈ సంగతి తెలుసా.. ఈ పక్షి ఈకలు బంగారం ధర కంటే ఎక్కువ..

PayDay Loan: మీకు శాలరీ రావడం ఆలస్యమవుతోందా.. రూ.లక్ష కావాలా.. కేవలం నెల రోజుల కోసం ఈ బ్యాంక్‌లో పే డే లోన్