Murder Mystery: స్మార్ట్‌లో కారులో ఇస్మార్ట్ స్కెచ్‌..మాట్లాడుతూ మాట్లాడుతూనే మర్డర్‌.. ప్రీ ప్లాన్డ్‌ కోల్డ్‌ బ్లడెడ్ అంటున్న పోలీసులు

|

Aug 20, 2021 | 2:46 PM

కత్తులతో చంపేసేవాళ్లున్నారు.. పిస్టల్‌తో కాల్చేసేవాళ్లున్నారు.. సుపారీ ఇచ్చి లేపించేసేవాళ్లూ ఉన్నారు. కిడ్నాప్ చేసి శవం దొరక్కుండా చేసేవాళ్లున్నారు. కానీ ఇవేమీ జరగలేదు. స్మార్ట్‌గా యంగ్‌ తరంగ్‌లా కనిపిస్తున్న రాహుల్‌ని అంతే స్మార్ట్‌గా...

Murder Mystery: స్మార్ట్‌లో కారులో ఇస్మార్ట్ స్కెచ్‌..మాట్లాడుతూ మాట్లాడుతూనే మర్డర్‌.. ప్రీ ప్లాన్డ్‌ కోల్డ్‌ బ్లడెడ్ అంటున్న పోలీసులు
Businessman Rahul
Follow us on

కత్తులతో చంపేసేవాళ్లున్నారు.. పిస్టల్‌తో కాల్చేసేవాళ్లున్నారు.. సుపారీ ఇచ్చి లేపించేసేవాళ్లూ ఉన్నారు. కిడ్నాప్ చేసి శవం దొరక్కుండా చేసేవాళ్లున్నారు. కానీ ఇవేమీ జరగలేదు. స్మార్ట్‌గా యంగ్‌ తరంగ్‌లా కనిపిస్తున్న రాహుల్‌ని అంతే స్మార్ట్‌గా, అదే ఓ స్మార్ట్ కారులో చంపేసి గుట్టుచప్పుడు కాకుండా సైడైపోయారు. అవును.. ఇక్కడ కత్తుల్లేవ్‌… తుపాకుల్లేవ్‌… ప్రాణం మాత్రం పోయింది. ఎలా..? ఇప్పుడు యువ పారిశ్రామికవేత్త రాహుల్ మర్డర్ కేసులో అంతు చిక్కని ప్రశ్నలు.  కత్తులతో చంపేసేవాళ్లున్నారు..

ఫోర్ట్ ఎండీవర్ హై ఎండ్ కారు AP 16FF 9999.. ఈ కారులో ఇగ్నీషన్‌ని కీ అవసర్లేదు. జస్ట్ బటన్ నొక్కితే చాలు కారు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతుంది. కారు లోపల కూర్చున్నాక ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. బయటికొచ్చి లాక్ వేస్తే.. ఏం చేసినా డ్యామేజ్‌ లేకుండా కారును ఓపెన్ చెయ్యలేం. అంత ఇస్మార్ట్‌ టెక్నాలజీ ఈ కారు సొంతం.

ఈ కారులో ఫ్లైట్‌లోని కాక్‌పిట్ తరహాలో ఇంటర్నల్‌ రికార్డింగ్ కూడా ఉంటుందట. స్మార్ట్ లాక్ వేశాక.. అదే స్మార్ట్‌గా ఓపెన్ చెయ్యకపోతే డేటా డిలీట్ అయిపోతుందని కూడా టెక్నికల్ ఎక్స్‌పెర్ట్స్ అంటున్నారు. అందుకే నిన్న కారు పార్క్‌ చేసి ఉంది, లోపల డెడ్‌బాడీ ఉందీ అని తెలిశాక కూడా దాన్ని ఓపెన్ చెయ్యడానికి గంటలకు గంటలు టైమ్ పట్టింది.

అడ్డగోలుగా ఓపెన్ చెయ్యడం కాదు.. కంపెనీ ప్రతినిధులే రావాలనుకున్నారు. వాళ్లు వచ్చినా నో యూజ్‌. చివరికి చేసేదేమీ లేక అద్దం బద్దలు కొట్టి ఓపెన్ చెయ్యాల్సి వచ్చింది. క్లూస్ ఉండవేమో అనుకున్నారుగానీ.. ఓ తాడు, దిండు, తలవెంట్రుకలు కేసుకు క్లూలుగా మారాయి. ఇక రాహుల్ ఫాదర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆర్థిక లావాదేవీలు రీజన్‌గా తెలుస్తోంది. మర్డర్ తర్వాత విజయ్ కుమార్ అదృశ్యం.. హత్య వెనుక అతని హస్తంపై అనుమానాలను రేకెత్తించింది.

ఇదిలావుంటే.. కోగంటి సత్యం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ ఈ కోగంటి సత్యం ఎవరు? కోగంటి సత్యం పేరు చెబితే బెజవాడ ప్రజలు గజగజ వణికిపోతారు. అంతటి క్రైమ్ హిస్టరీ ఉందీ కోగంటి సత్యానికి. క్రైమ్ కు కేరాఫ్ అడ్రస్ కోగంటి సత్యం. పేరుకు బెజవాడ రౌడీషీటర్… కానీ, ఇతనికి ఈ పదం సరిపోదు. అంతకంటే పెద్ద పదం వాడితేనే కరెక్ట్. ఎందుకంటే, అతనికున్న క్రైమ్ హిస్టరీ ఆ రేంజ్ లో ఉంది మరి. గొడవలు, దాడులు, మోసాలు, కిడ్నాప్ లు, భూకబ్జాలు, మర్డర్లు ఇలా చెప్పుకుంటూపోతే అతను చేయని నేరమంటూ లేదు. మరి హత్య చేసింది ఎవరు.. చేయించింది ఎవరో తేల్చే పనిలో ఫుల్ బిజీగామారారు విజాయవాడ పోలీసులు.

ఇవి కూడా చదవండి: Sharia Law: షరియా చట్టం అంటే ఏంటి? తాలిబన్లు అమలు చేసే ఈ చట్టంలో శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?

Afghanistan crisis: ఆ విమానంలో నుంచి కింద ప‌డిన ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్ములు!