Vijaya Polymers Gannavaram: కృష్ణాజిల్లా గన్నవరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విజయ పాలిమిర్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. పెద్ద ఎత్తున ఎగసిపడిన మంటలు చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా నల్లని దట్టమైన పొగ అలుముకుంది. దీంతో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తెంపల్లి రైల్వే గేట్ సమీపంలో శ్రీవిద్య పాలిమర్స్ కంపెనీలో శుక్రవారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 5 గంటలకు కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నప్పటికీ అదుపులోకి రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో మరిన్ని అగ్నిమాపకం వాహనాలతో ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ కంపెనీలో సూపర్ సంచులు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో భారీగానే ఆస్థి నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.