వారి ఆచూకీ చెబితే రూ. లక్ష బహుమతి: సీపీ

|

Aug 20, 2020 | 8:52 PM

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ ఘటనపై పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో కీలక వ్యక్తుల సమాచారం ఇస్తే రూ. లక్ష బహుమతి ఇస్తామని సీపీ ప్రకటించారు.

వారి ఆచూకీ చెబితే రూ. లక్ష బహుమతి: సీపీ
Follow us on

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ ఘటనపై పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో కీలక వ్యక్తుల సమాచారం ఇస్తే రూ. లక్ష బహుమతి ఇస్తామని సీపీ ప్రకటించారు. స్వర్ణప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనలో నిందితులు, అనుమానితులు విచారణకు సహకరించడం లేదని సీపీ తెలిపారు. రమేష్‌ ఆస్పత్రి, స్వర్ణప్యాలెస్‌ హోటల్‌ యాజమాన్యాల మధ్య జరిగిన ఒప్పందం వివరాలు వెల్లడించడానికి సైతం నిరాకరిస్తున్నారని అన్నారు. విచారణలో భాగంగా.. రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం కరోనా చికిత్సకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేలిందని సీపీ వెల్లడించారు. ఎటువంటి జాగ్రత్తలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా కోవిడ్‌ సెంటర్‌ నిర్వహించారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆస్పత్రి బోర్డు సభ్యులతో పాటు అనుమానితులుగా ఉన్న ప్రతీ ఒక్కరికి నోటీసులు ఇచ్చి విచారిస్తామన్నారు. ఇందుకు సంబంధించి విచారణ కొనసాగుతోందని తెలిపారు.

కాగా, స్వర్ణప్యాలెస్‌ ఘటనపై విచారణ కమిటి ప్రభుత్వానికి బుధవారం నివేదిక అందించింది. రమేష్‌ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాలను, నిబంధలను పూర్తిగా ఉల్లంఘించించిందని తేల్చింది.10 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని నివేదికలో స్పష్టం చేసింది.