Family Killed at Railway Crossing: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విషాద సంఘటన చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్వద్ద పట్టాలు దాటుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. లక్నో-వారణాసి మెయిన్ లైన్‌లోని బిల్హరిఘాట్ – ఉల్నాభరి రైల్వే స్టేషన్ల మధ్య దుర్గాపూర్-రాంపూర్వ క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఓ ద్విచక్రవాహనం పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా రైలు దూసుకొచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో దంపతులతో సహా వారి ఇద్దరు పిల్లలు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు రాంపూర్ పుర్వారీ గ్రామానికి చెందిన రామచంద్ర నిషాద్ (38), అతని భార్య విమల (34), వారి ఇద్దరు పిల్లలు విమల్ (4), గణేష్ (2)గా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై అయోధ్య సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేష్ పాండే మాట్లాడుతూ.. ఇది దుర్గాపూర్ గ్రామ సమీపంలోని మానవ రహిత రైల్వే క్రాసింగ్ వద్ద జరిగినట్లు వెల్లడించారు. రామచంద్ర నిషాద్ తన కుటుంబంతో కలిసి బైక్‌పై వెళ్తూ.. రైలు పట్టాలను దాటడానికి ప్రయత్నించాడని.. ఈ క్రమంలో అకస్మాత్తుగా వచ్చిన రైలు వేగంగా ఢీకొట్టినట్లు తెలిపారు.
Also Read: