Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశుల వారికి అనుకూల పరిస్థితులు.. ఈ రోజు రాశి ఫలాలు..

Today Horoscope: కొన్ని సందర్భాల్లో మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు

Horoscope Today: ఈ రాశుల వారికి అనుకూల పరిస్థితులు.. ఈ రోజు రాశి ఫలాలు..
Today Horoscope
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 07, 2021 | 6:35 AM

Today Horoscope: కొన్ని సందర్భాల్లో మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టిసారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 7న) ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి తెలుసుకుందాం..

మేషం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధు మిత్రులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగ పరంగా అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

వృషభం: చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.ఆదాయం మరింతగా పెరుగుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధు మిత్రుల సమావేశం ఆనందం కలిగిస్తుంది.

మిధునం: చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి వ్యాపార పరంగా స్వంత నిర్ణయాలు కలసిరావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులుంటాయి.

సింహం: ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.

కన్య: నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మ విశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతాన శుభాకార్య విషయాలలో చర్చలు చేస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల సహాయంతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

తుల: రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.దూర ప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు.

వృశ్చికం: సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. దూరప్రాంతం నుండి శుభవర్తమానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. వ్యాపార విషయంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

ధనస్సు: కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది.ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు తప్పవు. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. దైవ చింతన పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మకరం: అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధువుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. నిరుద్యోగులు నూతన అవకాశములు పొందుతారు.

కుంభం: కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవరిస్తారు ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

మీనం: ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు అతికష్టం మీద పూర్తి చేస్తారు. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు అవకాశములు అందినట్టే అంది చేజారుతాయి

Also Read:

Gold Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాముల ధర ఎంత పెరిగిందంటే..!

విజయ గర్జన కాదు.. వరంగల్‌లో కల్వకుంట్ల గర్జన పెట్టుకోండి.. ఈటల స్వాగత సభలో కిషన్ రెడ్డి ఎద్దేవా