Short Circuit in Pandal: అంగరంగవైభవంగా వివాహ మహోత్సవం జరిగింది. అంతలోనే ఆ పెళ్లింట విషాదం నెలకొంది. విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కబళించింది. మండపంలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. సీతాపూర్ జిల్లాలోని కమలాపూర్ ప్రాంతంలోని ఓ గ్రామంలో శుక్రవారం రాత్రి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ క్రమంలో బలంగా వీచిన ఈదురుగాలుల ధాటికి విద్యుత్ తీగలు తెగిపడి పెళ్లి మండపంపై పడ్డాయి. దీంతో మండపం అంతటా షాక్ వచ్చింది. ఈ షార్ట్ సర్క్యూట్‌తో వల్ల నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని వరుడు వెల్లడించాడు.
వారిని వెంటనే అంబులెన్స్‌లో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లింట నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. శుభకార్యం ముగియకముందే.. ఈ విషాద సంఘటన జరిగిందంటూ బంధువుల కన్నీరుమున్నీరవుతున్నారు.
Sitapur: Four people died and three others injured due to electrocution during a marriage ceremony at a village in Kamalapur area last night.
“Due to strong winds, a pole of the pandal touched a high voltage line running above it, resulting in the incident,” the groom said. pic.twitter.com/K9dSBiuuz5
— ANI UP (@ANINewsUP) May 28, 2021
Also Read: