పది రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌లోని సంబల్ జిల్లాలో ఓ ప్రేమజంట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. పోలీసులు న్ని రకాల దర్యాప్తులు చేసిన తర్వాతే ప్రేమ ఫలించదేమోనన్న బెంగతో సుఖీయా, బంటి ఆత్మహత్య చేసుకున్నారని డిక్లేర్ చేశారు.. ఈ సంఘటన జరిగిన ఆరు రోజులకు అదే చెట్టుకు కుల్దీప్ అనే యువకుడి శవం వేలాడుతూ కనిపించింది.. ఇతడెందుకు ఉరివేసుకున్నాడా అన్న అనుమానం పోలీసులకు వచ్చింది.. వెంటనే ప్రేమ జంట ఆత్మహత్య కేసును తిరగదోడారు..మళ్లీ దర్యాప్తు మొదలుపెట్టారు.. ఈసారి చాలా సీరియస్‌గా చేసిన దర్యాప్తులో కుల్దీప్‌ది ఆత్మహత్య కాదని హత్య అని తేలింది.. అంతేనా ఆ ప్రేమ జంటది కూడా బలవన్మరణం కాదని, బలవంతంగా ప్రాణాలు తీశారని తెలిసింది.. ఈ ముగ్గురుని చంపాల్సిన అవసరం ఎవరికుందా అని ఆరా తీస్తున్న పోలీసులకు భయంగా బిత్తరచూపులు చూస్తున్న వారి కజిన్ వినీత్ కనిపించాడు..
మూడు చావులకు అతడే కారణం అయివుండాడన్న గట్టి నమ్మకంతో తమదైన శైలిలో విచారించారు పోలీసులు.. నేరం ఒప్పుకున్నాడు.. ఎందుకు చంపాల్సి వచ్చిందో కూడా చెప్పుకున్నాడు. తన కజిన్ సుఖీయా, బంటి ప్రేమించుకుని పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారన్న విషయం తెలిసి రగిలిపోయాడు వినీత్.. కుటుంబ పరువు, గౌరవం కోసం వారిని చంపేయాలనుకున్నాడు.. వెంటనే తన ముగ్గురు ఫ్రెండ్స్‌ను పిలిచి తన ప్లాన్ చెప్పాడు.. వారికి రెండున్నర లక్షల సుపారి కూడా ఇచ్చాడు.. అందరూ కలిసి ఆ ప్రేమజంటను చంపేసి .. ఆత్మహత్యగా చిత్రీకరించారు.. ఇది ఎలాగోలా వినీత్ సోదరుడికి తెలిసింది. జరిగినదంతా పోలీసులకు చెబుతానంటూ బెదిరించాడు.. దీంతో బెదిరిపోయిన వినీత్ అతడిని కూడా చంపేసి అక్కడే చెట్టుకు ఉరివేశాడు..ఇప్పుడు వినీత్ , అతడి ముగ్గురు స్నేహితులు కటకటాలు లెక్కపెడుతున్నారు.