వివాహేతర సంబంధం.. ఇద్దరి ముక్కుల్ని కోసేసిన పెద్దలు.. ఆ తర్వాత…

| Edited By:

Jan 30, 2020 | 7:19 AM

ఓ 23 ఏళ్ల యువకుడు.. 30 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అయితే ఈ విషయం కాస్త సదరు మహిళ భర్త కుటుంబీకులకు తెలియడంతో.. ఇద్దరిని పట్టుకుని కట్టేశారు. అంతటితో ఆగకుండా.. కత్తి తీసుకుని వారి ఇద్దరి ముక్కుల్ని కోసేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ అయోధ్య జిల్లాలోని కంద్ పిప్రా గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితులిద్దరూ.. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ 23 ఏళ్ల వ్యక్తి.. 30 ఏళ్ల […]

వివాహేతర సంబంధం.. ఇద్దరి ముక్కుల్ని కోసేసిన పెద్దలు.. ఆ తర్వాత...
Follow us on

ఓ 23 ఏళ్ల యువకుడు.. 30 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అయితే ఈ విషయం కాస్త సదరు మహిళ భర్త కుటుంబీకులకు తెలియడంతో.. ఇద్దరిని పట్టుకుని కట్టేశారు. అంతటితో ఆగకుండా.. కత్తి తీసుకుని వారి ఇద్దరి ముక్కుల్ని కోసేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ అయోధ్య జిల్లాలోని కంద్ పిప్రా గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితులిద్దరూ.. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ 23 ఏళ్ల వ్యక్తి.. 30 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని.. అయితే సదరు మహిళ భర్త.. సౌదీలో ఉంటున్నట్లు తెలిపారు. అయితే సదరు మహిళ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న విషయం.. మామకు తెలియడంతో.. ఇద్దర్ని పట్టుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. అయితే ఆ యువకుడు ఇంటికి వచ్చిన సమయంలో సదరు మహిళ మామతో పాటు కుటుంబ సభ్యులు ఆ జంటని పట్టుకున్నారు. అనంతరం ఓ స్థంభానికి కట్టేసి.. తీవ్రంగా కొట్టారు. అనంతరం వారి ఇద్దరి ముక్కుల్ని కోసేశారు. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రస్తుతం ఇద్దర్ని అరెస్ట్ చేశారు.