AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైన్స్‌ బంద్‌.. ఫంక్షన్‌ హాల్‌లో ఫుల్‌ ఎంజాయ్‌! సిద్దిపేటలో 100 మంది ఉద్యోగుల మందు పార్టీ!

సిద్దిపేటలో వైన్స్ బంద్ రోజు ప్రభుత్వ ఉద్యోగులు విందు పార్టీ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల అనంతరం సుమారు 100 మంది పీఈటీలు మద్యం సేవించినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. అనుమతులు లేకుండా జరిపిన ఈ పార్టీపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

వైన్స్‌ బంద్‌.. ఫంక్షన్‌ హాల్‌లో ఫుల్‌ ఎంజాయ్‌! సిద్దిపేటలో 100 మంది ఉద్యోగుల మందు పార్టీ!
Siddipet Liquor Party
Balaraju Goud
|

Updated on: Sep 26, 2026 | 10:21 AM

Share

సిద్దిపేట జిల్లాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాల్‌లో ప్రభుత్వ ఉద్యోగుల విందు పార్టీ చర్చనీయాంశంగా మారింది. సుమారు 100 మంది PETలు ఈ విందులో పాల్గొన్నట్లు సమాచారం. పార్టీ సందర్భంగా కొందరు మద్యం సేవించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మద్యం బంద్ ఉన్నరోజు విందు, జల్సాలు జరుపుకోవడం దుమారం రేపుతోంది.

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ జిల్లాలోని వైన్‌ షాపులను మూసివేసిన సమయంలోనే ఈ విందు ఏర్పాటు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పార్టీకి ఎక్సైజ్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారా లేదా అనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా సిద్దిపేటలో క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీలు ముగిసిన అనంతరం పాల్గొన్న ఉద్యోగుల కోసం విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మద్యం సరఫరా, వినియోగానికి సంబంధించిన నిబంధనలు పాటించారా? అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు పరిశీలించాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, దృశ్యాలు బయటకు రావడంతో ప్రభుత్వ ఉద్యోగుల విందు పార్టీపై చర్చ జరుగుతోంది. అధికారుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us