Student Suicide: ఉద్యోగం వస్తుందో.. రాదోనని హాస్టల్‌ గదిలో విద్యార్థి ఆత్మహత్య..!

|

Dec 26, 2021 | 7:40 PM

Student Suicide: కొందరు విద్యార్థులకు ఇరవై ఏళ్లలోపే నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం వస్తుందో, రాదోననే భయంతో, మానసిక ఒత్తిడి ఇలా..

Student Suicide: ఉద్యోగం వస్తుందో.. రాదోనని హాస్టల్‌ గదిలో విద్యార్థి ఆత్మహత్య..!
Follow us on

Student Suicide: కొందరు విద్యార్థులకు ఇరవై ఏళ్లలోపే నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం వస్తుందో, రాదోననే భయంతో, మానసిక ఒత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల ఎందరో విద్యార్థులు తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న వయసులోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది.

నేషనల్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్ణాటక (NIT-K)కు చెందిన 19 ఏళ్ల విద్యార్థి తన హాస్టల్‌ గదిలోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సిటీ పోలీసు కమిషనర్‌ శశికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు బీహార్‌లోని ఒరాయ్‌ గ్రామానికి చెందిన బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి. ఆత్మహత్యకు పాల్పడిన స్థలంలో సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా ఉద్యోగం దొరకని పరిస్థితి ఉందని, చదువు కోసం కుటుంబం తీసుకున్న రుణాలను సైతం తీర్చే స్థోమత లేదని ఆయన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. అయితే ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల ఇన్సిస్టిట్యూట్‌కు వెళ్లలేకపోతున్నామని, అంత్యక్రియలు జరించాల్సిందిగా కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. అయితే అంత్యక్రియల కోసం మృతదేహాన్ని పాట్నాకు తీసుకెళ్లడానికి ఇన్సిస్టిట్యూట్‌ సిబ్బంది, విద్యార్థులు ప్రయత్నాలు చేస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు. మృతుడు పదో తరగతి చదువుతున్న సమయంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడని తెలిపారు. అల్పాహారం కోసం అతడిని నిద్రలేపేందుకు అతని స్నేహితులు హాస్టల్‌ గదికి రావడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇవి కూడా చదవండి:

Crime News: ప్రాణాల మీదకు తెచ్చిన సెల్పీ మోజు.. గోదావరిలో పడి ఇద్దరు గల్లంతు!

Bihar Boiler Blast: నూడుల్స్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. బాయిలర్ పేలి ఆరుగురు మృతి.. 12మందికి సీరియస్!