జైలులో తుపాకితో ఖైదీలు హల్ చల్… సంచలనం రేపుతోన్న వీడియో

| Edited By:

Jun 28, 2019 | 8:15 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జైలులో ఖైదీల వద్ద మారణాయుధాలు కనిపించడం కలకలం రేపుతోంది. ఖైదీలు ధైర్యంగా మారణాయుధాలను పట్టుకుని జైలులో సంచరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఇద్దరు ఖైదీలు తుపాకులు పట్టుకుని జైలు అధికారులను బెదిరించడం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని ఒకరు కెమెరాలో చిత్రీకరించారు. జైలులో వీరికి మద్యం, మాంసం వంటివి కూడా సరఫరా అవుతున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. అయితే జైలులోకి కెమెరాలు ఎలా వెళ్లాయో […]

జైలులో తుపాకితో ఖైదీలు హల్ చల్... సంచలనం రేపుతోన్న వీడియో
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జైలులో ఖైదీల వద్ద మారణాయుధాలు కనిపించడం కలకలం రేపుతోంది. ఖైదీలు ధైర్యంగా మారణాయుధాలను పట్టుకుని జైలులో సంచరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో ఇద్దరు ఖైదీలు తుపాకులు పట్టుకుని జైలు అధికారులను బెదిరించడం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని ఒకరు కెమెరాలో చిత్రీకరించారు. జైలులో వీరికి మద్యం, మాంసం వంటివి కూడా సరఫరా అవుతున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.

అయితే జైలులోకి కెమెరాలు ఎలా వెళ్లాయో అర్థం కావడం లేదు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై జైలు సూపరింటెండెంట్ ఏకే సింగ్ స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని, మరో రెండు రోజుల్లో దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి ఇప్పటికే నలుగురు అధికారులను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.