
BALAPUR ATTEMPT MURDER : హైదరాబాద్‌లోని జిల్లెలగూడకు చెందిన హరీష్.. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా రాత్రి 2 గంటల సమయంలో రోడ్డుపై ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగాడు.
అయ్యో పాపం అనుకున్న హరీష్.. ఆ వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చాడు. అతన్ని చంద్రాయణగుట్టలో డ్రాప్ చేశాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా.. లిఫ్ట్ అడిగాడు.. సేవాభావం కలిగిన.. హరీష్ అతన్ని కూడా బైక్ ఎక్కించుకున్నాడు. అటు తర్వాత బాలాపూర్ ఆర్‌సీఐ రోడ్డులోకి తీసుకెళ్లాడు.
నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు.. బైకర్‌పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ మంటల్లో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు.. చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆ రూట్‌లో సీసీ విజువల్స్‌ను పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్‌జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..