జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్(Ajith Dowal) నివాసం వద్ద బుధవారం కలకలం రేగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంట్లో చొరపడటానికి విఫలయత్నం చేశాడు. ఆగంతకుడి కదలికలను గమనించిన పోలీసులు.. అతనిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. జన్‌పథ్(Janpath) లోని అజిత్ దోవల్ నివాసంలో ఈ ఘటన జరిగింది. తొలుత జన్‌పథ్‌లో ప్రవేశించిన దుండగుడు.. అక్కడి నుంచి నేరుగా ఆయన నివాసానికి వెళ్లాడు. ఇంట్లోకి చొరపడే ప్రయత్నం చేయగా.. అక్కడే ఉన్న సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తనను వదిలేయాలని, అజిత్ దోవల్‌తో పని ఉందంటూ గట్టిగా వాగ్వాదానికి దిగాడు. అనంతరం అతణ్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రాథమిక దర్యాప్తు సందర్భంగా అతను ఓ అద్దెకారు డ్రైవర్ అని పోలీసులు నిర్ధారించారు.
తన శరీరంలో ఎవరో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చారని, అందుకే తనకు తెలియకుండానే అలా వచ్చేశాని తొలుత ఆ వ్యక్తి చెప్పడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. అప్రమత్తమై.. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే అతని ప్రవర్తనకు, చెప్తున్న ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడంతో వైద్యుల్ని పిలిపించారు. ప్రాథమిక విచారణలో అతను మతిస్థిమితం సరిగాలేని వ్యక్తి అని, కర్ణాటకవాసిగా గుర్తించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
Also Read
Khammam Crime: మామతో వివాహేతర సంబంధం.. ఏకాంతంగా ఉన్నప్పుడు కూతురు చూసిందని.. తల్లి కర్కశత్వం
Central Government: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. ఇకపై వారికీ హెల్మెట్ తప్పనిసరి.. పాటించకపోతే జైలే..