Drugs Seize in Delhi Airport: దేశంలో డ్రగ్ దందాను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలీసుల కళ్లు గప్పి డ్రగ్స్‌ను దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించి చాలామంది పట్టుబడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఉగాండా మహిళను అరెస్టు చేసి.. 2 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.14.14 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఉగాండాకు చెందిన మహిళ దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చింది. ఈ క్రమంలో ఆమెపై అనుమానంతో తనిఖీలు చేపట్టారు. ఆమె బ్యాగ్‌ని పరిశీలించగా.. 2,020 గ్రాముల ఆఫ్-వైట్ కలర్ పౌడర్‌ను కనుగొన్నారు. పరీక్షల్లో అది హెరాయిన్‌గా నిర్ధారించారు. విదేశీ మహిళను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలాఉంటే.. ఆదివారం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కెన్యాకు చెందిన ఒక మహిళ నుంచి భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. దీనివిలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.15 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
Also Read: