Man Learns Wife is Transgender: కోటి ఆశలతో పెళ్లి చేసుకున్న నవ వరుడికి ఊహించని షాక్ తగిలింది. పెళ్లి చేసుకున్న రెండు నెలల తర్వాత భార్య హిజ్రా అని తెలిసి భర్త అవాక్కయ్యాడు. తానూ మోసపోయానని న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో వెలుగుచూసింది.
లింగమార్పిడి చేసి అమ్మాయి అని చెప్పి తనతో వివాహం జరిపించారని, మోసం చేసిన అత్తమామలపై కేసు పెట్టాలని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాన్పూర్ నగర నివాసి అయిన యువకుడు శాస్త్రినగర్ లోని పంకి ప్రాంతానికి చెందిన యువతిని ఏప్రిల్ 28వతేదీన ఘనంగా వివాహమాడాడు. వివాహం అనంతరం వరుడు వధువుతో శారీరక సంబంధం ఏర్పరచుకోలేక పోయాడు. తనకు అనారోగ్యంగా ఉందని రెండు నెలలుగా నమ్మబలికింది.
అయితే, కొన్ని రోజుల తర్వాత భార్య ప్రవర్తనల్లో మార్పులు వస్తుండటంతో అనుమానం వచ్చి భర్త ఆసుపత్రికి తీసుకెళ్లిన వైద్య పరీక్షలు చేయడంతో అసలు నిజం బట్టబయలు అయ్యింది. దీంతో అశ్చర్యపోయిన వరుడి కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు. ఆమె మహిళ కాదని, లింగమార్పిడి చేయించుకుని ట్రాన్స్‌జెండర్‌గా మారిందని వైద్యులు తెలిపారు.
దీంతో తన భార్య లింగమార్పిడి చేయించుకున్న హిజ్రా అని పరీక్షల్లో తేలడంతో షాక్ గురైన భర్త అత్తమామలపై ఫిర్యాదు చేశారు. తన భార్య వైద్య నివేదికతో వధువు, ఆమె తల్లిదండ్రులు, వివాహ మధ్యవర్తిపై భర్త ఫిర్యాదు చేయడంతో వారిపై తాము ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తమామలతో పాటు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఇన్ స్పెక్టర్ చెప్పారు.