Road Accident in Nalgonda: తెలంగాణలోని నల్లగొండ జిల్లాల్లో ఘోర ప్రమాదం సంభవించింది. కారు డివైడర్‌ను ఢీకొని పంటపొలాలల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి – అద్దంకి రహదారిపై వల్లభాచెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కారు అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. మృతులను చెర్లపల్లికి చెందిన గుండెమల్ల శ్రీకాంత్, జెర్రిపోతుల వెంకటేశ్వర గౌడ్‌గా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి పలు వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన తీరును చూస్తుంటే.. అతివేగమే కారణమని స్థానికులు, పోలీసులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. దీంతో చెర్లపల్లిలో విషాదం నెలకొంది.
Also Read: