అతని వయసు 17.. యువతి వయసు 20.. ఓ గదిలో నెల రోజులుగా సహజీవనం.. మనస్పర్థలతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం.. యువకుడు మృతి

|

May 30, 2021 | 8:13 AM

తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు ఎంతకాలం ఉండవని అంటుంటారు. తెలిసీ తెలియక తీసుకునే నిర్ణయాలు కొన్ని సమయాల్లో ప్రాణాల మీదకు వస్తుంటాయి. క్షణికావేశంలో తీసుకున్న..

అతని వయసు 17.. యువతి వయసు 20.. ఓ గదిలో నెల రోజులుగా సహజీవనం.. మనస్పర్థలతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం.. యువకుడు మృతి
Follow us on

తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు ఎంతకాలం ఉండవని అంటుంటారు. తెలిసీ తెలియక తీసుకునే నిర్ణయాలు కొన్ని సమయాల్లో ప్రాణాల మీదకు వస్తుంటాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒకరి ప్రాణాలు పోయాయి. అతని వయసు 17 సంవత్సరాలు కూడా నిండని మైనర్‌.. 20 ఏళ్ల యువతితో ప్రేమ వ్యవహారం. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వీరి ప్రేమ వివాహం వరకు వెళ్లింది. ఇద్దరు కలిసి ఓ గది అద్దెకు తీసుకుని సహజీవనం ప్రారంభించారు. పెద్దలు వారించినా వినకుండా వారి గదిలోనే వివాహం చేసుకున్నారు. కానీ వారి జీవనం ఎంతకాలం ఉండలేదు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఎస్సై చంద్రశేఖర్‌ వివరించారు. యూసుఫ్‌గూడలో నివసించే యువకుడు ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తూ సినీ పరిశ్రమలో పని చేస్తున్న యువతి (20)తో ప్రేమలో పడ్డాడు. పెద్దలు అంగీకరించకపోవడంతో జవహార్‌నగర్‌లో ఓ గది అద్దెకు తీసుకుని సహ జీవనం చేస్తున్నారు. వారం రోజుల కిందట గదిలోనే పెళ్లి చేసుకున్నారు. అయితే రెండు రోజులుగా  యువతి, యువకుడి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి పెద్దదైంది. శనివారం ఇద్దరూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఇక యువతి చున్నీ ఊడిపోవడంతో కింద పడిపోయింది. ఇప్పటికే యువకుడి మెడకు ఉరి బిగుసుకుంది. ఆమె వెంటనే వెళ్లి చుట్టుపక్కల వారికి సమాచారం అందించి తీసుకువచ్చేసరికి యువకుడు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తండ్రి పోలీసు శాఖలో పని చేస్తున్నట్లు సమాచారం.

ఇలా తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పెళ్లి వయసు రాకముందు నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి. ప్రేమలో పడటం, పెళ్లి చేసుకుంటే పెద్దలు అంగీకరించరనే భయం.. ఒక వేళ ప్రేమ వివాహం చేసుకున్నాక అప్పుడే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం, అంతలోనే గొడవలు జరుగుతుండటం ఇలా రకరకాల కారణాలతో  తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఇవీ కూడా చదవండి:

శ్రీ చైతన్య విద్యా సంస్ధలలో భారీ చోరీ.. రూ.100 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ పోయిందంటూ ఫిర్యాదు..

రెజ్లర్ పై దాడిలో ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ ‘.’మాస్టర్ మైండ్,…కోర్టులో ఢిల్లీ పోలీసుల వెల్లడి