TV9 effect: ఒక పక్క కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను తోడేస్తోంది. కరోనా రెండో వేవ్ ఉధృతి పెరిగిన సమయంలో మందులకు కొరత.. ఆక్సిజన్ కొరత.. ఇలా అవసరమైన ఏదీ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. దీంతో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారిపోయాయి. కరోనా వస్తే జాగ్రత్తలు తీసుకుంటే కోలుకోవచ్చు అనే ధైర్యం సన్నగిల్లింది. కరోనా తొ మరణమే శరణ్యమా? అనే టెన్షన్ ప్రజలకు మొదలైంది. ఇటువంటి సమయంలో కరోనా కోసం ఉపయోగించే మందులు దొరకడం కష్టంగా మారింది సామాన్యులకు. అయితే, కొన్ని చోట్ల డబ్బుంటే చాలు కరోనా చికిత్స కోసం వాడే మందులు అందుబాటులో ఉంటూవస్తున్నాయి. కొందరికి ప్రతి విషయమూ వ్యాపారమే. సక్రమ వ్యాపారాన్ని చేస్తే పదుల్లో సొమ్ములు. అదే అక్రమ వ్యాపారం అయితే.. కోట్లకు పడగలెత్తవచ్చు. ఈ అక్రమార్కులకు తమ వ్యాపారం కోసం ఏదైనా ఫర్వాలేదు. దానిలో ఎటువంటి మానవత ఉండదు.
ఇదిగో కరోనా.. వాళ్లకు ఆ అవకాశాన్నిచ్చింది. ఆక్సిజన్.. రెమిడేసివర్.. బ్లాక్ మార్కెట్ లో విచ్చల విడిగా అమ్మకాలు సాగించారు. వందల రూపాయలకు దొరికే మందులు వేలాది రూపాయలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఈ పరిస్థితులపై టీవీ9 గట్టిగా ఫోకస్ పెట్టింది. బ్లాక్ మార్కెట్ అక్రమార్కులకు చెక్ పెట్టడానికి రంగంలోకి దిగింది. తనకున్న విస్తృత నెట్ వర్క్ తో గట్టి నిఘా పెట్టింది. దీనికోసం టీవీ9 దళాలు ప్రత్యేకంగా పనిచేశాయి. గుట్టు చప్పుడు కాకుండా కరోనా మందుల్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న వారిని పట్టిచ్చే కార్యక్రమం చేపట్టింది. ఏలూరు, విశాఖపట్నం, నెల్లూరు, హైదరాబాద్ ఇలా తెలుగురాష్ట్రాల్లో కరోనా మందుల్ని నల్లబజారులో అమ్ముకుంటూ కరోనా బాధితుల్ని బేజారు ఎత్తిస్తున్న అక్రమార్కుల ఆగడాలను వెలుగులోకి తీసుకువచ్చింది. టీవీ 9 చేపట్టిన ఈ నిఘా ఆధారంగా పోలీసులు కూడా రంగంలోకి దిగారు. చాలాచోట్ల ఇలా అక్రమంగా కరోనా మందుల్ని అమ్ముతున్న వారిని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. కరోనా రెండో వేవ్ సందర్భంగా ఎదురైన పెద్ద సవాలు ఈ మందుల బ్లాక్ మార్కెటింగ్ ఈ విషయంలో టీవీ9 నిఘా అక్రమార్కుల గుండెల్లో రైళ్ళను పరిగెత్తించింది అని చెప్పొచ్చు.
ఇక కరోనా రెండో వేవ్ ఉధృతంగా సాగుతున్న వేళ ఆనందయ్య మందు వెలుగులోకి వచ్చింది. ఈ మందు తీసుకున్నవారికి కరోనా తగ్గుతోంది అనే ప్రచారం ఊపందుకుంది. కరోనా కోరల్లో చిక్కుకున్న ప్రజలకు ఇది అనుకోని వరంలా అనిపించింది. కష్టంలో ఉన్నవారికి చిన్న గడ్డిపోచ కూడా పెద్ద రిలీఫ్ గానే అనిపిస్తుంది కదా. అలాగే, కరోనా బాధితులకు ఆనందయ్య మందు చీకట్లో దీపంలా కనిపించింది. ఈ మందుకోసం అందరూ పరుగులు తీశారు. ఇంకేముంది మళ్ళీ అక్రమార్కులకు ఛాన్స్ దొరికింది. దీంతో ఈ మందునూ వారు వదలలేదు. ఆనందయ్య మందు మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నల్లబజారులో అమ్మకానికి పెట్టారు. దీంతో టీవీ9 నిఘా రంగంలోకి దిగింది. ఆనందయ్య మందు బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారి వివరాలను బహిర్గతం చేసింది. ఒక ప్రత్యెక కథనంలో టీవీ9 ఈ ఆనందయ్య మందు బ్లాక్ మార్కెటింగ్ వివరాలు వెల్లడించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు. ఇలా కరోనా బూచిని అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో ప్రజలను మోసం చేయాలని ప్రయత్నించిన వారి పై టీవీ9 నిఘా నీడ గట్టి పంజా విసిరింది. మరోసారి తన ప్రజల పక్షాన టీవీ9 పోరాటం విజయవంతం అయింది. టీవీ9 వెలుగులోకి తెచ్చిన ఆనందయ్య మందు బ్లాక్ మార్కెట్ దందా ప్రత్యేక కథనం మీకోసం..
TV9 War Against Fake News: కరోనా వ్యాక్సిన్ పై అపోహలు నమ్మద్దు..అనుమానం వస్తే నిపుణులతో మాట్లాడండి!