Ganja: గంజాయి మాఫియాపై పోలీసులు – టీవీ9 జాయింట్‌ ఆపరేషన్‌.!

|

Oct 04, 2021 | 2:14 PM

ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి మాఫియా బరితెగిస్తోంది. గుడి హత్నూర్‌ మండలం ఉమ్రి గ్రామ శివారులో పత్తి పంట చాటున అక్రమంగా

Ganja: గంజాయి మాఫియాపై పోలీసులు - టీవీ9 జాయింట్‌ ఆపరేషన్‌.!
Ganja
Follow us on

Tv9 – Police Joint Operation – Ganja: ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి మాఫియా బరితెగిస్తోంది. గుడి హత్నూర్‌ మండలం ఉమ్రి గ్రామ శివారులో పత్తి పంట చాటున అక్రమంగా గంజాయి సాగు చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న టీవీ 9, పోలీసులతో కలిసి జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టింది. 5 ఎకరాల విస్తీర్ణంలో వందకు పైగా గంజాయి మొక్కలను గుర్తించారు. టీవీ9 టీమ్‌, పోలీసులను చూసిన గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి పరారయ్యాడు.

గుడిహథ్నూర్ మండలం ఉమ్రి గ్రామ శివారులో పత్తి పంట చాటున గంజాయి అక్రమ సాగు చేస్తున్నారు. పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టిన టీవి9 టీం.. 5 ఎకరాల విస్తీర్ణంలో 100 కు పైగా గంజాయి మొక్కలను గుర్తించింది. సాగు చేస్తున్న వ్యక్తి పరారయ్యాడు. ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. గంజాయి అక్రమ సాగు వ్యవహారంపై దాడులు కొనసాగుతున్నాయి.

Read also: Badvel By Election: బద్వేల్‌లో ప్రచారాన్ని ఉధృతం చేసిన అధికార వైసీపీ.. పార్టీ కార్యకర్తలు, నేతలకు కీలక ఆదేశాలు