సినీ ఫీల్డ్. పైకి ఎంత గ్లామర్‌గా కనిపిస్తుందో..లోపల అన్ని చీకటి కోణాలు ఉంటాయ్. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే అవకాశాన్ని ఎరగా చూసి..అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ప్రబుద్దులు ఈ ఫీల్డ్‌లో కోకొల్లలు. ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా హిందీ రియాలిటీ షోలలో యాక్ట్ చేసే ఓ నటి ఇటువంటి మోసానికే గురైంది.
ఆమె చేస్తోన్న కార్యక్రమాల ద్వారా ఓ జూనియర్ ఆర్టిస్ట్ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. మంచివాడిగానే నటిస్తూ సదరు నటిపై కన్నేసాడు . అక్టోబర్ 13న పార్టీ ఉందంటూ ఓ హోటల్‌కి ఆమెను తీసుకెళ్లాడు. అనంతరం ఆమెకు డ్రగ్స్ ఇచ్చి..అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం ఆ నటి గర్భవతి కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
జరిగిందేదో జరిగిపోయింది, పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా..అతడు నెక్ట్స్ డే నుంచి కనిపించడం మానేశాడు. ఈ విషయంపై ఆమె..జూనియర్ ఆర్టిస్ట్ తల్లిదండ్రులను అప్రోచ్ అయినప్పటికి..వారు కూడా ముఖం చాటేశారు. మోసపోయానని తెలుసుకున్న నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు 24 ఏళ్ల వినీత్ వర్మగా గుర్తించారు. ఎఫ్ఐఆర్ బుక్ చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు.