Telangana family suicide in Vijayawada: విజయవాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణానది ఒడ్డున ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నిజామాబాద్‌కి చెందిన కుటుంబం దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. అనంతరం విజయవాడలోని కన్యకాపరమేశ్వరి సత్రంలో విషం తాగి తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకోగా.. తండ్రీ కొడుకులు కృష్ణానదిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు. తల్లి కొడుకు లాడ్జిలో చనిపోగా.. మరో కొడుకు తండ్రి నదిలో దూకారు. మృతులు పప్పుల శ్రీలత, పప్పుల ఆశిష్, పప్పుల సురేష్, అఖిల్‌గా పేర్కొన్నారు. మృతులు నిజామాబాద్ వాసులుగా గుర్తించారు. ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యలకు కారణంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న విజయవాడ పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
నిజామాబాద్‌లోని గంగస్థాన్ ఫెస్ 2 కి చెందిన సురేష్ కుటుంబం ఆత్మహత్యకు కారణం ప్రయివేట్ ఫైనాన్స్ సంస్థ వేధింపులు అని పేర్కొంటున్నారు. లోన్ కట్టలేదని వారి ఇంటిని సంస్థ ప్రతినిధులు సీజ్ చేశారు. ఆరు నెలలుగా ప్రయివేట్ ఫైనాన్స్ సంస్థతోపాటు పలువురి నుంచి ఈ కుటుంబానికి వేధింపులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం సురేష్ కొడుకు అఖిల్ నడిపిస్తున్న పెట్రోల్ బంక్ లో కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం సురేష్ కుటుంబం విజయవాడ వెళ్లాక ప్రవేట్ ఫైనాన్స్ సంస్థ ఇంటిని సీజ్ చేసింది. ఒకేసారి ప్రైవేట్ ఫైనాన్సర్ లు, అప్పుల వాళ్ళు వేధించడంతో.. అవమానం భరించలేక సురేష్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
సురేష్ కుటుంబసభ్యులు మూడు రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు. చాలమంది ఫైనాన్షియర్లు ఇంటికి వచ్చే వారని తెలిపారు.
Also Read: