కొన్నిసార్లు సరదా కోసం చేసే పని ప్రాణాలమీదకు తీసుకువస్తుంది.సెల్ఫీ మోజులో కొంతమంది ప్రాణాలను కోల్పోతున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా సెల్ఫీ తీసుకోబోయి ఓ యువకుడు ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించాడు. ఈ విషాద సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీలో వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాకు చెందిన చాంద్ మహ్మద్ విహారయాత్రలో భాగంగా మనాలీకి వెళుతూ బనాలా వద్ద బియాస్ నది వద్ద ఆగారు. బియాస్ వద్ద సెల్ఫీ తీసుకోబోయి ప్రమాదవశాత్తు నదిలో పదిమృత్యువాత పడ్డాడు. ఇక నదిలో మునిగిపోయిన మహ్మద్ మృతదేహంను గజఈతగాళ్ల సహాయంతో పోలీసులు బయటకు తీశారు.