Government officer Bribery : ఇదీ.. కొందరి ప్రభుత్వ అధికారుల పనితనం, పుష్కలంగా జీతాలున్నా.. కోట్లలో లంచం సొమ్ము కూడబెట్టకుంటున్న వైనం

|

Mar 27, 2021 | 8:49 PM

TS Government officer Bribery : మంది సొమ్ముతో పుష్కలంగా జీతాలు, అలవెన్సులు, వీటికితోడు డీఏలు, పీఆర్సీలు ఇలా ప్రభుత్వ అధికారులను కంటికి రెప్పలా..

Government officer Bribery : ఇదీ.. కొందరి ప్రభుత్వ అధికారుల పనితనం, పుష్కలంగా జీతాలున్నా.. కోట్లలో లంచం సొమ్ము కూడబెట్టకుంటున్న వైనం
Tahsildar Upender Bribery 1
Follow us on

TS Government officer Bribery : మంది సొమ్ముతో పుష్కలంగా జీతాలు, అలవెన్సులు, వీటికితోడు డీఏలు, పీఆర్సీలు ఇలా ప్రభుత్వ అధికారులను కంటికి రెప్పలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధ్యమైనంతవరకూ సాకుతుంటే, కొందరు అవినీతి అధికారులకు ఆ సొమ్ములు సరిపోవడంలేదు. మంది సొమ్మును నెలనెలా ఠంచనుగా జీతాల రూపంలో అందుకుంటూనే అదే మందికి పనిచేయాల్సి వచ్చేసరికి మాత్రం ఆమ్మామ్యాలు కావాలంటూ బల్ల కింద, ఖరీదైన టేబుళ్ల మీదా చేతులు పెడుతున్నారు. ఎన్నో చోట్ల ఇలాంటి కంత్రీగాళ్ల కక్కుర్తి బయటపడుతున్నా వీళ్లకి ఏమాత్రం దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగానే ఉంటుంది. తాజాగా ఇవాళ మరో ప్రభుత్వ ఉద్యోగి లాంచాల బాగోతం బట్టబయలైంది.

వివరాల్లోకి వెళితే, సాంబశివరావు అనే రైతు తన భూమీ సర్వే చేయాలి మహాప్రభో అని ఖమ్మంజిల్లా వేంసూరు మండలం డిప్యూటీ తహశీల్దార్ ఉపేందర్ ను కోరాడు. అయితే, ఈ పనికి గాను లక్ష రూపాయలు డిమాండ్ చేశారు సార్ వారు. ఇప్పటికే పలుమార్లు చెప్పులరిగేలా తిప్పించుకుని చావు కబురు చల్లగా చెప్పాడని చిర్రెత్తుకొచ్చిన ఆ రైతు ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చాడు. అంతేకాదు, అవినీతి నిరోధక శాఖ అధికారుల సాయంతో పక్కా ప్రణాళిక ప్రకారం అవినీతి తిమింగళాన్ని రైతు సాంబశివరావు పట్టించారు.

దీంతో ఖమ్మంలోని మమత రోడ్డులో గల ఉపేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఈ సోదాల్లో ఉపేందర్ ఇంట్లో 37లక్షల 17వేల 590 రూ లు నగదు, 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఉపేందర్ అతని కుటుంబ సభ్యులకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడా గుర్తించినట్టు సమాచారం.

Read also : Gram Panchayat funds మహేష్ బాబు సినిమా ఫార్ములా, మీ నిధులు…మీ ఇష్టం : ఇవాళే జీవో జారీ చేసిన కేసీఆర్ సర్కారు