Crime News: మృతదేహానికి తాడుకట్టి ఈడ్చుకుంటూ.. ట్రాక్టర్‌లోకి ఎక్కించి.. అమానవీయ ఘటనపై సర్వత్రా ఆగ్రహం

|

Jul 30, 2022 | 11:49 AM

Bihar: బిహార్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బెగుసరాయ్‌ (Begusarai)లో ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని తరలించే క్రమంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Crime News: మృతదేహానికి తాడుకట్టి ఈడ్చుకుంటూ.. ట్రాక్టర్‌లోకి ఎక్కించి.. అమానవీయ ఘటనపై సర్వత్రా ఆగ్రహం
Follow us on

Bihar: బిహార్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బెగుసరాయ్‌ (Begusarai)లో ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని తరలించే క్రమంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే .. బెగుసరాయ్‌లోని లాఖో పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నిపానియా సిమెంట్‌ ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు పక్కన ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోస్ట్‌మార్టం నిమిత్తం డెడ్‌బాడీని తరలించే క్రమంలో ఇద్దరు వ్యక్తులు.. మరణించిన వ్యక్తి కాళ్లకు తాడుకట్టి తీసుకెళ్లారు. నేలపై ఈడ్చుకుంటూ కొంత దూరం లాక్కెళ్లారు. అనంతరం మృతదేహాన్ని ట్రాక్టర్‌లోకి ఎక్కించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆపై స్ట్రెచర్‌ సహాయంతో లోపలికి తీసుకెళ్లారు.

కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మృతదేహం తరలించే విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ జంతువులా మనిషి మృతదేహాన్ని లాక్కెళ్లారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా ఈ అమానవీయ ఘటనపై ఎస్పీ యోగేంద్ర కుమార్‌ స్పందించారు. విచారణ జరిపిస్తామని దోషులుగా తేలితే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే మృతుడి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని ఎస్పీ పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఎస్‌ఐను సస్పెండ్ చేసినట్లు, SHOకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..