Arunachal Pradesh: అరుణాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం.. కొనసాగుతున్న ఆపరేషన్‌..

|

Nov 15, 2021 | 3:49 PM

Three terrorists neutralised: అరుణాచల్ ప్రదేశ్‌లో ఉగ్రవాదులకు చెక్‌ పెట్టేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. మణిపూర్‌లోని మయన్మార్ సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులు

Arunachal Pradesh: అరుణాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం.. కొనసాగుతున్న ఆపరేషన్‌..
Indian Army
Follow us on

Three terrorists neutralised: అరుణాచల్ ప్రదేశ్‌లో ఉగ్రవాదులకు చెక్‌ పెట్టేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. మణిపూర్‌లోని మయన్మార్ సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో కల్నల్ దంపతులు సహా ఎనిమిదేళ్ల కుమారుడు, ఐదుగురు సైనికులు శనివారం మరణించారు. ఈ ఉగ్రదాడి అనతరం అస్సాం రైఫిల్స యాంటీ టెర్రరిస్ట్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాద గ్రూపు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్-ఖప్లాంగ్ (NSCN-K-YA) యుంగ్ ఆంగ్ వర్గానికి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని లాంగ్డింగ్ జిల్లాలోని ఖోగ్లా వద్ద సోమవారం భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో అస్సాం రైఫిల్స్- ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గరు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం 8 గంటలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని ఖోన్సా అస్సాం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ ప్రకటించారు. కాగా.. ఈ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. సాయుధ బలగాల్లో ఎవరైనా గాయపడ్డారా..? లేదా అనే దానిపై స్పష్టత రాలేదు.

మణిపూర్‌లోని మయన్మార్ సరిహద్దు సమీపంలో జరిగిన ఆకస్మిక దాడిలో కల్నల్, అతని భార్య, వారి ఎనిమిదేళ్ల కుమారుడు సహా ఐదుగురు సైనికులు మరణించారు. అనంతరం అస్సాం రైఫిల్స్‌ భారీ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈశాన్య ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మెరుగుపడ్డాయనుకున్న సమయంలో ఆకస్మిక దాడి జరగడంతో ప్రభుత్వం అప్రమత్తమై భద్రతా బలగాలను రంగంలోకి దింపింది.

Also Read:

Cows listening songs: గోశాలలో పాటలు వింటున్న ఆవులు.. ఏ పాటలో తెలుసా..

Tea Plant: కొండ ప్రాంతాల్లోనే తేయాకును ఎందుకు పండిస్తారు..? అసోం టీకి ఉన్న ప్రత్యేక ఏమిటి..?